మగువ విలువ
(మగువ = చెలువ = అతివ
= పడతి = కాంత = స్త్రీ = వనిత = తరుణి )
ఓ శాంతమైన కొలనులోన అందమైన కలువ,
మన ముందరున్న లోకమందు కదిలే ఈ అతివ….
సందెవేల మేను తాకు చినుకున్న చలువ,
వేల రెట్లు పెరిగి వచ్చి తన మనసులోన నిలువ….
సంద్రమెంత పెద్దదైన నిను ఒడ్డు చేర్చు నావ,
నీ సమస్యెంత ఖఠినమైన చక్కబెట్టు చెలువ…
చిరువయసునుంచి చితి వరకు నువు పొందినట్టి సేవ,
అమ్మగానొ, ఆలిగానొ నీ చెంతనున్న మగువ…
ఓపికన్న పదానికే పర్యాయపదం ధరణి,
ఆ ధరణికున్న మనురూపం ఈ ఇలన ఉన్న తరుణి…
నీ జన్మనిచ్చి, తన జన్మాంతం నీ మంచిచేయు జనని,
ఏ పదముపేర్చి పొగడగలము ఆకాశమంటి తనని...
ఎండలోన పయనించి, అలసిపోయి ఆశ్రయించి,
విశ్రమించి విరమించే ఆ చెట్టు నీడె గొప్పదయితె,
అరక్షణము కూడ వీడకుండ అనుక్షణము నిన్ను ధ్యానించి..
నీకందించిన చెలువ చెట్టు ,చలువ ఎంత గొప్పది...
లక్షలాది లక్షణాల మంచితనమె వనిత,
సహస్రాది సద్గుణాల పొందికేగ ప్రతి కాంత....
సహకారం తప్ప ఏ స్వార్థగుణం లేకుండా,
మంచితనం తప్ప ఏ మోసగుణం లేకుండా...
ప్రేమ అనే బాటలోన పరిమితమై తను ఉంటే,
భూమాతకున్న ఓపికకే పరిణతిలా జీవిస్తుంటే....
స్వార్థగుణం తప్ప ఏ సహకారం లేకుండా,
మోసగుణం తప్ప ఏ మంచితనం లేకుండా...
వనిత విలువ తెలుసుకోని ఈ వక్రబుద్ది లోకాన,
తన విలువనెరుగు కొంతమంది తప్పుకున్న సమయాన...
జాలిలేని మగమృగాల కంటికి తను ఒంటరిగా,
కనిపించిన క్షనములోన తన గుండెలోన భయము...
మనమివ్వాల్సిన గౌరవాన్ని మరచిపోయి ఘోరంగా,
మన మహిలకు కల్పించని రక్షణకది ఋజువు...
తనవారిని గౌరవించి, పర స్త్రీలను మోహించే,
మనపురుషుల ఘణకార్యం ప్రతి వీధి చివర కొలువు..
కనుచూపుమేర కాంతేదని ఆశతోన గాలించే,
దుర్బుద్ది ఉన్న కోరికలే ఆ కల్లచివర నెలవు...
సమస్యలనే సాగరాన పయనించే ఓ వనిత,
సొంతపనికి ఒంటరిగా బయట అడుగుపెడుతుంటే,
పది అడుగులైన పడకముందె, పదిమంది ఎదురువస్తుంటే..
తలదించుకువెల్తున్నా తనవైపే చూస్తుంటే,
పలురకాల పలుకులతొ పరువంతా తీస్తుంటే...
కల్లనీల్లు వస్తున్న కఠినంగా భాషిస్తుంటే...
ఒకటికి ఇంకొకటిగా సమస్యలెన్న పుడుతుంటే,
శాంతనేది లేకుండా అనుక్షణము క్షోభ పెడుతుంటే...
చెప్పుకునే వీలులేక ఒంటరిగా ఏడుస్తూ,
రాత్రిపూట కునుకు బదులు కన్నీటితోన గడిపేస్తూ...
మరుదినముకు దిగులుగా స్వాగతాన్ని చెబుతుంది,
తీరని ఆ సమస్యల్లొ పయనం సాగిస్తుంది...
మౌనంగా ఉంది అని, మాట్లాడుట రాదు అని,
విలువలన్ని వదిలేసి విసిగించే ఓ యువకుడా...
అందంగా ఉంది అని, అందుబాటు అయ్యిందని,
వెంటపడి వేదించే ఓ మనసులేని పురుషుడా...
పురుషుడున్న ప్రతిచోటా తనకొచ్చిన కష్టాలతొ,
విసిగిపోయి కాంతలంత ఓసారి ఎదురు తిరిగితే...
యువకుడున్న ప్రతిచోటా యమలోకమంటి వేదనలతొ,
అలసిపోయి స్త్రీలంతా ఓసారి బదులు తీర్చితే...
ప్రేమించే గుణమైనా, ద్వేశించే దారైనా...
పురుషజాతి సర్వం మగువకెపుడు వెనకే...
ప్రేమలోన పయనిస్తూ పేరుతెచ్చుకున్న పడతి,
తీరుమారి ద్వేశమనే దారిలోన పడితే...
సుఖాలన్ని పొందుతున్న మన పురుషజాతి సర్వస్వం,
ఆ ద్వేశసెగన కాలిపోయి అంతరించిపోదా...
బారమెంత మోపినా సహియించే ధరణి,
ఇంత ఓపికెందుకని ఒక్కసారి కంపిస్తే...
ఈ జీవకోటి మొత్తం మరణమంచు చేరదా...
ఈ కనిపించే సృష్టంతా ఆ కంపనలో కడతేరదా..
అవమానమెంత చేసినా సహియించే తరుణి,
అనుకువెన్ని నాల్లని ఒక్కసారి కోపిస్తే...
మగాడనే బలుపంతా మట్టికరిచిపోదా...
ఈ పేరుకున్న పొగరంతా ఒక్కసారి తగ్గదా...
