Friday, August 26, 2011

cinima-serial


సినిమ
సి(see)-  చూసి
ని-          నిజం కానిది
మ-        మరచిపో
చూసి నిజం లేనిది మర్చిపో...మంచి ఏమన్నా ఉంటే తీస్కో



సీరియల్............


సీ only రియల్  ....

నిజాన్ని మాత్రమే చూడు....  పనికి రానిది చూడకు ,, చూసినా పాటించకు.....




Rakhi









My poor hands has became  millionaire after tighing your RAKHI



Labels:

Remake of ఆడించి అస్టాచమ్మా ఓడించావమ్మా..(SONG)





పల్లవి:  ఊరించి నాలో ప్రేమ ఊగించిదమ్మా,
        నీ వెంటే వస్తానందమ్మా...   
        నిజంగా స్వర్గమే ఉంటే...నీతోనే బతకడం అంతే...
        నీ వెంటే ఉండటం అంటే...గగనాన్నే గెలవడం అంతే...
        నా మాటే నమ్మి మనసార నువ్వొప్పుకోవమ్మ...     "ఊరించి "
చరణం: నా ముందు నువ్వుంటే, నా మనసే కుదురుగ నిలబడనందమ్మా...
        నీ వెంటే వస్తుంటే,దినదినము క్షణమై గడిచిందే బొమ్మా...
        నీలోని నవ్వు, నాకోసమివ్వు..
        నేనింక వరమేం కోరుకోనూ...
        మనసార నువ్వు నా సొంతమవ్వు,
        నీ నవ్వును దూరం వెల్లనీను...  
        నే వెల్లే ముల్ల బాటలో, నేనుండే చిన్ని ఆశలో,
        ఓ వరమై నాకు,దొరికిన ముత్యం నీవేలేనమ్మ...
        నిజంగా స్వర్గమే ఉంటే...నీతోనే బతకడం అంతే...
        నీ వెంటే ఉండటం అంటే...గగనాన్నే గెలవడం అంతే...
    "ఊరించి"
పల్లవి:  నా మౌనం నీవెంటే ఓ పరుగులు తీస్తూ వచేస్తుందమ్మా...
        నీ మోము చూస్తుంటే కనురెప్పే కదలక నిలుచుందే బొమ్మా...
        ను లేని నేను,ఎటు వెల్లిపోను
        నా జన్మకర్థమేమి కాను...
        నీలోని నేను ఎటు తప్పుకోను
        ఏమైన నేను ఒప్పుకోను...
        నాకుండే చిన్ని గుండెలో,నే చేసే తప్పు ఒప్పులో...
        ఓ దేవత లాగా కొలువై ఉంది నీవేలేనమ్మా....
        నిజంగా స్వర్గమే ఉంటే...నీతోనే బతకడం అంతే...
        నీ వెంటే ఉండటం అంటే...గగనాన్నే గెలవడం అంతే..
 "ఊరించి"                        

Searching for a great thing


I have searched in mid 9t dec 31,
I have found many people saying “happy new year”.
But I don’t find the thing what am I searching for…..
I am searching in internet every day evening,
I have found many GBs of information,
But I don’t find the thing what am I searching for…..
I am searching every day 9t in sky,
I have found many cute cute stars,
But I don’t find the thing what am I searching for…..
Even I have searched in eating items also,
I have found a lot of good tastes…
I have searched in ocens, sky, moon, forest& everywhere in the world….
But I don’t find at least nearly equal to the thing what iam searching for….
BUT now….
After seeing a true and heartful smile on your face….
My dear SISTER
I am convinced my self that
I have found now that the thing what I want….

Labels:

Saturday, August 13, 2011

my tears are so nice


చెరో లోకమై పయణించే మనము               

స్నేహమనే ఒక గూటిన చేరి

నవ్వులతో ప్రతి రోజును మలచి

కష్టాల్లోనూ కలిసే నడిచి

దినమొక క్షనముగ గడిపిన మనము

గడియొక యుగముగ గడపాలంటూ

ఎడబాటే మనకెదురౌతుంటే

ఎదకోతే నా వరమౌతుంటే

ఆ వరమిచ్చింది నువ్వని తెలిసి

ఈ నిజమంతా ఓ కలయని తలచి

ఎటునడవాలో తెలియక నేను

ఎండమావిలా నిలుచున్నాను

ఏ కారణాలు ఎరుగను

నా దోషమసలు తెలియదు.....

ఎదురుగ గతమే కదిలొస్తున్నా

ఎదనొక రాయిగ మలిచేస్తున్నా..

కల్లముందు నువు కనిపిస్తున్నా

నిను చేరలేక నే నిలబడి ఉన్నా..
             
చిన్ని చిన్ని నా నవ్వులకర్థం

నను వీడిపోని నీ గురుతుల కథలే          

ఆగిపోని కన్నీటికి అర్థం

ఇక దూరమైన నీ పలకరింపులే

నీ ఙ్నాపకాల నీడలో నా రోజులింక గడవనీ

నా నువ్వు లేని దారిలో ,నే నన్ను మరిచి నడవనీ...


అస్తమించిన ఆ సూర్యుని సైతం

మరు ఉదయాన్నే ఉదయించేను

ఇక దూరమైన మన ఈ స్నేహం

ఏనాడైనా మరి ఉదయించేనా

స్నేహాస్తమయం అనుకుంటున్నా...

ఉదయించే ఆ ఉదయాన్నే నే కలగంటున్నా.........
                   

                                  

Labels:

Wednesday, August 10, 2011

పదే పదే మది పైన, పలికే
ప్రతి పదం నిజమవునా...?
అదే అదే మనలోన, కదిలే
ప్రతి దినం కథలవునా...?

హరివిల్లు స్త్రీ సమాజం
తనకున్న ప్రేమ అదికం
తనలోన ప్రేమ తత్వం
కనిపెట్టలేము సహజం
 

      
ఓటమికే శత్రువు నీవై,
భయమునకే అందని ఫలమై,
మార్గం లో ఏ రాల్లున్నా,
దారంతా మలుపులు ఉన్నా,
గెలుపునకే ఆప్తుడు నీవై,
ఓటమి కే ఓటమి చూపు..

just for fun


   
నా అంటే నాకిస్టం,
నా వాల్లంటే ఇంకా ఇస్టం,
నాలా ఉంటే మీకే నష్టం,   
నాతో ఉంటే ఉండదు కష్టం,
నాలా ఉంటూ,నాతో ఉంటే,
నాకింకా ఎంతో ఇష్టం...

మెదడు చేసే చేస్టలు మనసుకి నచ్చకపోతే ఆత్మ , ఆత్మహత్య చేసుకొవాల్సిందేనా...


పడుతూ లేస్తూ పయనిస్తున్నా,
నీ కలయిక కోసం తపియిస్తున్నా.
బాదలలోంచి కదిలొస్తున్నా,
నీ నవ్వుల లోనికి అడుగిడుతున్నా...
స్వాగతించవా ఓ నా చెలియా,
హ్రుదయమనే నీ కోవెల లోకి.
కలకాలం నే కావలినౌతా,
కరుణిస్తే నీ తోడై వస్తా....
నువు తెలియకమునుపు శిలనై ఉన్నా,
నిను చుసాకే నే మనిషౌతున్నా.
బాదలతో నే బలి ఔతున్నా,
నీ స్నేహం కోసం బతికొస్తున్నా...
అనుమతించవా ఓ నా సఖియా,
నీ అడుగులలో అడుగేయటానికి.
అంతం వరకు చెంతే ఉంటా,
కస్టాల్లోనూ కలిసే వస్తా...
నీ ఊహలకే నే ఊపిరి పోస్తా,
నీ ఆశలకే నే అర్థాన్నౌతా...
స్వాగతించవా ఓ నా చెలియా,
తరగని నీ చిరునవ్వులలోకి,
నీ నవ్వులకే చిరు కానుకనౌతా
కలకాలం తోడుండటానికి...
                       

Tuesday, August 9, 2011

I dont know costly behavior &
I dont know have any costly habbits
but i have a very costly charecter that u can buy with the cost of humanity/-

అల లాంటి నా జీవితం...
తీరానికి సొంతమా ,సంద్రానికి సొంతమా అంటే
సమాధానం దొరకదు...

మౌనాంజలి. . . .

భయమెరుగని నా దేశం భావి తరం కావాలని,
మంచితనం విఙ్నానం తెరల నీడ వీడాలని,
కోరి కోరి ఓ మనసే రాసెను ఆ గీతాంజలి. . . .
మరుగుతున్న కాలానికి మార్పు నువ్వు కావాలని,
పెరుగుతున్న అవినీతికి పెను మర్పును తేవాలని,
రగులుతున్న నా రక్తం రక్తాంజలి రాస్తే. . . .
చేసుకున్న కస్టంతో కడుపు నింపుకోవాలని,
పేదవాడి కల్లల్లో కన్నీటిని కడగాలని,
రాలుతున్న ప్రతి చుక్కో శోకాంజలి రాస్తే. . . .
ఊరుకున్న ఓపికంత ఒక్కసారి ఉభికితే. . . .
ఆపుకున్న ఆవేశం అలజడులై అలిమితే. . . .
ఓటమితో అన్యాయం ఒంటరిగా మిగలదా. . . .
ఆకలితో అవినీతి మరణాన్నే కలవదా. . . .
తిని బలిసిన నాయకులను తరిమి కొట్ట కదలండని,
తెగ మరిగిన దుర్మార్గులనరికట్టగ దిగిరండని,
నిజమెరుగని ప్రజలల్లో విప్లవాన్ని రేపుతా. . . .
పైకెదిగిన అవినీఎతిని పునాదితో కదుపుతా. . . .
కదలలేని అవినీతిని కదిపి నేను చుపుతా. . . .
మారలేని భారతాన్ని మార్చి నేను చూపుతా. . . .
మరుగుతున్న రక్తం తో, మారని నా కోరికతో,
చేయదలచి నా మనసే,చేవ లేని చేతులతో,
రాసానీ మౌనాంజలి. . . .

నను ద్వేశించే నా చెలియా.. నన్ను దాటి వెల్తావా..

భాష లేని నా ప్రేమ, భాద లేదని కాదు
మాట్లాడని నా ప్రేమ, మాట రాదని కాదు
రోజు రోజు కు నన్ను వీడుతూ,నువు
నా చేయి దాటుతున్నా,నీ చేయి వదలలేను,
నిను వదిలి నడవలేను...
గడియ గడియకి మెల్ల మెల్లగా బందమనే
ఆ తలుపు మూసుకున్నా,నీ తలపు మరువలేను
నిను మరచి బతకలేను...
మనసారా ప్రేమతోన నిను వలచిన నేను
అలసిపోను ఏనాడు,అంతరించే వరకు
నీ ద్యాసే నా శ్వాసగ బతుకుతున్న నేను  
ఆగిపోను ఏనాడు, నిన్ను చేరే వరకు
నా ఎద చప్పుడు నీవు,నీ మదిలో నే లేను
నువ్వు లేక నేలేను,నే నీకేమీ కాను..              

ఎవరికి ఎవరు

దరణే దారిని దహియిస్తుంటే,
కనులే కలలను కడిగేస్తుంటే,
మనిషే మమతను మసి చేస్తుంటే,
మాట మౌనం ఒకటౌతుంటే,
నింగే చంద్రుని మింగేస్తుంటే,
వనమే చట్లను కాల్చేస్తుంటే,
మదిలో మోసం జీవిస్తుంటే,
మనలో స్వార్థం పరిగెడుతుంటే,
ప్రభుత్వమెందుకు మారాలి,
నాయకులెందుకు దిగి రావాలి,
అవినీతికి మరి ఆదీ మీరే ,
అనుకుంటే ఇక అంతం మీరే,
భయమెందుకు బతకడానికి,
మూర్తమెందుకు మారడానికి,
మారి నువ్వు , మార్చి చూపు,
దారి చూపు, ధరికి చేరు....

నిద్రపో హాయిగా...

కిల కిల పలికే చిలక పలుకులు,
మిల మిల మెరిసే గగన కాంతులు,
నింగికి ఎగిసే అలల అరుపులు,
మెల్లగ వీచే పిల్ల గాలులు,
అలరించే ఈ అందాలన్నీ,
అడ్డాలై నా నిన్ను చేరితే,
అలజడులై నీ నిదురనాపితే,
నీకు నిద్ర ఎలా పడుతుంది పాపం.........
అందుకేగ చెలీ .....
నువు నిద్రించడానికి నా గుండెలోనే చోటిచ్చా....
అడ్డమైతే చెప్పు....
నా గుండె చప్పుడు సైతం ఆపేస్తా............  

life style

దేవుడు ఆడే దాగుడుమూతలు,
దయ్యం పాడే దరహాసాలు.
మహర్శి చేసే ఝోర తపస్సు,
మనుషులు నడిపే భార మనస్సు.
మహిలలు జరిపే దైవ పూజలు,
పురుషులు చేసే దేవి పూజలు.
మిత్రులు పంచే సంతోశాలు,
మంత్రులు పెంచే అక్రమాస్తులు.
తండ్రి విదించే పెద్ద ఆంక్షలు,
తనయుడివేమో పిచ్చి ఆశలు.
తప్పిన దారి,తగ్గిన నీతి,
మారిన లోకం,మరచిన న్యాయం,
చేజారిన ఈ లోకం చిగురించదు ఏ నాడు,
చిగురించిన నీ ఆశ చితి చేరక తప్పదు

నేనే నీవా

నాలో మనసును నీలో చూపి,
ప్రతిబింబించే అద్దం నీవా. . . .
నవ్వుల పువ్వును వరముగ ఇచ్చి,
నను మురిపించే అందం నీవా. . . .
నాలో కలలకు రంగులు కూర్చే,
అలోచనలకు ఆద్యం నీవా. . . .
భషై రాని, భాదై పోని నా,
ఒంటరి తనానికి అంతం నీవా. . . .
నా ఆగిన అడుగుకు కదలిక నేర్పిన,
చిరు నడకలకే నాఠ్యం నీవా. . . .
పదములు పలుకక నిలబడి పోయిన,
నా పెదవుల చివరన నవ్వే నీవా. . . .
నా మనసున మెదిలిన కోరిక యదలో,
ఓ పువ్వై పూచిన "రోజా" నీవా. . . .
నా మౌనం పాడిన సరిగమలయలో,
నవ్వై విరిసిన నేనే నీవా. . . .

న్యాయమా కాలమా

      
చెమట నీల్లను లెక్కపెట్టి , ఖర్చుపెట్టే కాలమా...
కస్ట జీవుల జీవితం లో జరుగు నస్టం తెలియదా....
కస్టపడనిదె కడుపు నిండని..
వల్లతో నా ఆటలు...
కస్టమంటే తెలియలేదని..
కస్టపెట్టే మనసుతో....
కస్ట జీవుల కడుపు కొట్టి ,
నష్ట పరచుట భావ్యమా..
చేతనయితే చేయినివ్వు ,
చేసి చూపే చొరవ చూడు...

మన్నించవా..

కనుజారే నా కన్నీల్లే
నిను చేరే నా భావాలైతే
మరణించిన నా ప్రాణ బందమా
మన్నించి నువు మల్లీ రావా....
మది దాటని నా మౌనాలే
నిను కదిపే ప్రియ స్వప్నాలైతే
కనిపించిన నా ప్రేమ హ్రుదయమా
కరుణించి నువు నన్ను చేరవా....
దరి చేరని నా గమనాలే
మది కోరే నీ గమ్యాలైతే
మరువలేని నా చలువ కమలమా
మనసారా నను స్వాగతించవా....
               

ఇదేనా లోకం

ఎదుటి వాడిని ఎర గా చేసి ...
ఎదగ నేర్చిన ఈ లోకం లో........
వ్యవస్తకందని విక్రుతులున్నాయ్
ప్రక్రుతి  పోల్చని లోపాలున్నయ్....
మంచికి కదిలిన నిదుల ప్రయాణం....
తప్పక చేరును దొరల ప్రాంగణం.....
చవటలు మింగిన ప్రజల సొమ్ములో....
చమట కు దక్కినదెన్నో శాతం.....
పెద్దలకందిన అక్రమాస్తి లో......
పేదలకందని ప్రతిఫలమెంత....

Monday, August 8, 2011

KEEP GOING (QUTATION)

 అడుగడుగున నిలబడక .....
 మలిఅడుగున తడబడక....

 సాగించిన నీ నడక.... 
 సాధించని ఓ ఘనత....

తన్నులు పడితే.......(bommarillu) (SONG)


పల్లవి
తన్నులు పడితే చదివేస్తామని మీరనుకుంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అనుకున్నాను.....     "కానీ ఇప్పుడు" ఊఊ...
అప్పుడు కొట్టిన దెబ్బలు నేటికి పనికొస్తాయంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను.....  "కానీ ఇప్పుడు" ఊఊ...
కొట్టడానికి ఏకంగా incharge పెట్టారుని
నారాయణకి డబ్బులు ఎక్కువ అనుకున్నాను
కొట్టేకన్నా వేరే మ్మార్గం లేదంటుంటే
మా బతుకులు చిచ్చులు పట్టారనుకున్నాను...
ఓ ఓ ఓ అరె ఇంతలో ఏదేదో జరిగిందిరో...
ఓ ఓ ఓ అది మంచిదని ఈ రోజే తెలిసిందిరో... "తన్నులు"
 


చరణం
కొట్టే దెబ్బలకి, తిట్టే తిట్టులకి మన ప్యూచర్
మొత్తం ఉంటుందంటే నమ్మనే లేదూ... "కానీ ఇప్పుడు" ఊఊ...
నేడుండే position కి అపుడుండే హింసలకి
సంబందాలే ఉంటాయంటే ఒప్పుకోలేదూ... "కానీ ఇప్పుడు" ఊఊ...
basic consepts మీకుంటేనే మంచిదంటే లేదన్నాను
మాటి మాటికి నస పేడుతుంటే
వీల్లకింక పనిలేదనుకున్నానూ.....
ఓ ఓ ఓ అరె ఇంత లో ఏదేదో జరిగిందిరో.....
ఓ ఓ ఓ ఫలితాలలో నే కుడా తడిశాను రా... . "తన్నులు":
 

చరణం
subject fail అయితే మీరిచ్చే కోటింగ్ కి
చదివేస్తామని మీరనుకుంటే తిట్టుకున్నాను.. "కానీ ఇప్పుడు" ఊఊ...
Languages కేమో periods లేకుంటే
మీ త్యాదస్తం పడలేక మేం చచ్చిపోయాము.. "కానీ ఇప్పుడు" ఊఊ...
Attitude మనకొద్దని ఆరోజే అన్నానులే
ఈరోజు అది లేనిదే మన విలువ ఇక లేదులే.    " తన్నులు"
:
:

Sunday, August 7, 2011

అపుడో ఇపుడో ఎపుడో.....(SONG)



పల్లవి:  అపుడో ఇపుడో ఎపుడో రుచి చూశానే మరి
           ఎపుడోకపుడాకలితో నే చస్తానే మరి..
           ఎపుడూ తిననే తినలా నీ వంటల మాదిరి..
           కలలో రొదగా మెదిలే నా శూరశిరోమని..
           ఎవరేమన్నా ఏమనున్నా నీ వంటే వేస్టని......       'అపుడో'
                           
 
చరణం: బోరుకన్నా ఇంకా ఘోరమైన వంటే ఏది అంటే
           వెంటనే మా ఆవిడదంటానే...
           రాయికన్న ఇంకా గట్టిదైన ఐటం ఏది అంటే
           అది నువు వండే పాకని అంటానే...
           నిన్నేల ఇచ్చాడో మరి నా మామకు దండాలు
           నీ వంటలు తినలేక నే బతకక పోతుంటే...            'అపుడో' 
                                                       
 
చరణం: నన్ను నేనే బాగా తిట్టుకుంటా ఈ ఇంటి
           వంటలు తినలేక ప్రెండ్స్ ఇంటికి రాకుంటే...
           నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో ఒక్క సారి
           హోటల్ కెల్లి త్రుప్తిగ తిని వస్తే...
           ఒక సారి పిష్ అంటూ మరుసారి న్యూ డిష్ అంటూ,
           ఏదేదో వండేస్తూ విరక్తి తెస్తుంటే.....                                                  'అపుడో'
                                                        

Labels:

మదిలో మౌనం,పనిలో లీనం...
ఆగని సమరం,ఆపని పయనం...
మలచిన మార్గం,తరగని ధైర్యం...
మంచితొ స్నేహం,వంచనకంతం...
గడిచిన సమయం నీదిఅ ఉంటే,
ఓటమి గమనం అటువైపుంటే,
గడువులు అడగక అడుగులు వేస్తూ,
గ్రహణం చూడకముందుకు వెల్తూ,
చెలిమితొ గెలుపుకు చేరువ అవ్వు..
ఓటములెరుగని విజయుడివవ్వు.....

B.Tech life

అమ్మ దెగ్గర అమాయకత్వం,
నాన్న ముందర నటనల తత్వం,
పడుచు పిల్లతో పోకిరి వేశం,
స్నేహం కోసం సాయుద సమరం,
ఆట స్తలాల్లో ఆవేశాలు,
గురు మూర్తులపై కుల్లు జోకులు,
తెల్లవారితే మన పరీక్షలు,
మొదలు పెట్టని ప్రిపరేషన్లు,
రాసేవేమో పిచ్చి కవితలు,
వచ్చే పలితం నిండు చంద్రులు....

Dont waste time

గడిచిన సమయం,
మలిచిన శిల్పం.
వాడిన కమలం,
పోయిన ప్రాణం.
కూలిన భవనం,
కాలిన వనం.
పలికిన పదం,
పగిలిన హ్రుదయం.
చిరిగిన కాగితం,
చేజరిన అద్దం.
రాలిన పత్రం,
రాసిన అక్షరం.
విరిగిన ఖడ్గం,
వదిలిన బాణం.
కరిగిన లవణం,
జరిగిన ఘోరం.
చేసిన త్యాగం,
పోయిన యవ్వనం.

వెల్లిందేదీ మల్లీ రాదు...
ఇపుడున్నది శాస్వతమవదు......
ఉన్నపుడే ఉపయోగించు.......
మలుపులనే గెలుపుగ మలచు........
విజయం చే విజయుడివవ్వు....

మనసు మరితే గెలుపు మరదా.....
రెప్ప పాటు లో ఫలితం పోదా.....
అవరోదాలే నీకే చేదా........
ఓటములే నీ నిచ్చన అవ
దా......
తొలి ఓటమికే ఎందుకు బాద....
మలుపులు గెలుపుకు సహజం కదా.....
క్రుషి ,కసి తోడై యుద్దం చేస్తే...
విజయం నీదై చెంతకు రదా.......
                                                       

మద్యతరగతి బతుకులివీ...

తీరలేని మా ఆశల వెనుక
తిరిగి రాని ఆ రోజులు ఎన్నో.....
చెప్పుకొనే ఈ సంతోషాల్లో
చెప్పలేని మా సమస్యలెన్నో......
మౌనమనే మా మనసు గదుల్లో
దాగి ఉన్న మా దుఃఖాలెన్నో...
మనసు పడే ఈ వేదన వెనుక
మరపు రాని ఆవేదనలెన్నో....
తెరచి ఉన్న ఈ మసక తెరల్లో
తెరవలేని ఆ తలుపులు ఎన్నో.......
మిగిలి ఉన్న ఈ భావన వెనుక
మింగలేని మా బాదలు ఎన్నో.......
మా మద్యతరగతి బతుకుల మద్య
అవసరమైనవి అనుబందాలే....
అంతే గాని ఆస్తులు కావు...
మా సంద్రానికి తీరముండదు.....
మా రవికిరణం అస్తమించదు..
మా రథ చక్రం విశ్రమించదు....


Labels:

అలవోకగ నీ గెలుపే రాదా



తెరచి ఉన్న తలుపేం లేదు,
తెలియకుండా తేవడానిక...
ఒలిచి ఉన్న పండూ కాదు,
మిగలకుండా మింగడానికి...
ఎవరూ లేని అనాద కాదు,
పిలవంగానే రావడానికి...
ఆగి ఉన్న బస్సూ కాదు,
విజిలేస్తేనే వెల్లడానికి...
వాలిపోయిన సూర్యుడు కాడు,
వెల్లంగానే రావడానికి...
దాటిపోయిన సమయం కాదు,
పూటపూటకు చూడడానికి...
వదిలేసిన వస్తువు కాదు,
వీలైనప్పుడు వాడడానికి...
నీవు పెట్టిన చట్టం కాదు,
నీ చుట్టూనే తిరగడానికి....
అంచులకేగి జారిన వాల్లు,
అంచలంచలుగ చేరిన వాల్లు,
పేరింటేనే బెదిరిన వాల్లు,
ఏదేమైనా కదలని వాల్లు,
చూస్తూ పోతే చాలా మందే...
భయమును ఎరుగని మది నీ రథమై,
కసితో కూడిన క్రుశి ఆయుదమై,
సాహసమే నీ రథ సారది గా,
అలుపెరుగని ఓ యుద్దం చేస్తే,
అలవోకగ నీ గెలుపే రాదా......


 నేటి విద్వా వ్యవస్థ




                       గతి తప్పిన మన తరగతులు...
                క్రమ శిక్షన లేని శిక్షనలు....
                పరినతి చెందని
పరీక్షలు....
                పలితం లేని
మన ఫలితాలు......
                అర్థం
లేని అలవాట్లు...
                అదుపే లేని ఆవేశాలు....
                ప్రేమ పేరు తో వ్యామోహలు.....
                నాన్న డబ్బు తో నానా పనులు...
                ఈ కలుశిత పూరిత చదువు వ్యవస్థ లో.....
                పనికొచ్చేవి పక్కన పెడితే....
                పనికి రానివే పెద్దగ ఉన్నాయ్.......

కోటి నిజాలను కలవనివ్వనీ.....

వెక్కిరించిన వెకిలి నవ్వులే,
వెంట వచ్చే వారదవ్వగా...
మొదలు పెట్టన నీ ప్రయత్నం,
మరో మార్పుకి నాంది పలకనీ....
అడ్డు తగిలే అడ్డు గోడలే,
ఆలోచనలకు ఆద్యమివ్వగా....
అలుపెరుగని నీ జీవనయానం,
విజయ కాంక్ష కు చేరువవ్వనీ.....
చేత కాదని చాటిన వాల్లే,
చెమ్మగిల్లి చేతులెత్తగా.....
కడతేరని నీ కలల ప్రయాణం,
కోటి నిజాలను కలవనివ్వనీ..... 
క్రుషి,కసి నీతో విశ్రమించగా,
ఓడిన ఓటమి ఒంటరి కాగా,
నీ కంట్లో కలిగే విజయానందం,
కనగల భాగ్యం కలగనివ్వనీ....

Saturday, August 6, 2011

అలవోకగ నీ గెలుపే రాదా

కలిసుంటా

నే వేసే ప్రతి అడుగడిగింది
పయనించే నా తోడేదని.....
నే పలికే ప్రతి పదమడిగింది
ఆలకించు నా ప్రియ మది ఏదని.....
నిను కానని నా చూపడిగింది
నే చుసే నీ నిజ నీడేదని.....
నిను మరువలేని నా మనసడిగింది
దూరమైన నా యద తోడేదని.....
గడవలేని ప్రతి గడియడిగింది
గడువు తీరునీ శోకాలెపుడని.....
నిలబడవా నా కన్నుల ఎదుట,
నిలదీసిన నా మనసు సాక్షిగా......
కలిసుంటా నా మరణం వరకు,
కనిపించే మన కలల సాక్షిగా.....

Labels:

అమ్మ


సర్వం స్వార్థం,నిత్యం మోసం....
కలుశిత పూరిత ఈ లోకం లో
స్వర్థం లేనిది ఏ కులానికి,
మోసం తెలియందే మతానికి...
ప్రతి స్నేహం మదిలో స్వచ్చత ఉందా...
మన యువ ప్రేమల్లో స్వర్థం లేదా....
లంచం మింగుతు ప్రజలను ముంచే
ప్రభుత్వ శాఖలొ లేదా స్వార్థం.
మోసం ద్వేశం ఇంటి పేరు గా....
ముందుకు నడిచే ఈ లోకం లో...
స్వార్థం లేని మనిసే ఉంటే..
ఆ మనిసికి పేరే పెట్టాలంటే...
పెట్టక తప్పదు  'అమ్మ' ని అంతే.....

Labels:

Friday, August 5, 2011

Real world

సర్వం స్వార్థం,నిత్యం మోసం....
కలుశిత పూరిత ఈ లోకం లో 
స్వర్థం లేనిది ఏ కులానికి,
మోసం తెలియందే మతానికి...
ప్రతి స్నేహం మదిలో స్వచత ఉందా... 
మన యువ ప్రేమల్లో స్వర్థం లేదా....
లంచం మింగుతు ప్రజలను ముంచే
ప్రభుత్వ శాఖలొ లేదా స్వార్థం.....
మనలో ఆశలకంతం లేదా....
మదిలో బాద కలగనే లేదా....
కల్మశమన్నది కనుమరుగయితే....
మోసం ద్వేశం మాయం అయితే.....
స్వార్థం శోకం సమాది అయితే...
మమత సమతలు మదిలో ఉంటే...
రంగుల లోకం పరిమలించదా........
రెండో ప్రక్రుతి అవతరించదా....  

ప్రజాస్వాంయం....

ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడిందే ప్రజాస్వాంయం అయితే....
మారవలసింది,మార్చుకోవాల్సింది.ప్రభుత్వం కాదు, ప్రజలే......
ప్రజల మార్పు చేత,ప్రజల మార్పు వలన,ప్రజాస్వాంయ మార్పు కొరకు ఏర్పడేదే నిజమైన ప్రజాస్వాంయం....
 

చెలీ

నిషా రాత్రిలో నిద్దుర మాని
నీకై వెతికిన రోజులు ఎన్నో......
నీలో కల
లకు రంగుల కోసం
తప్పక చేసిన తప్పులు ఎన్నో......
నీ పెదవుల చివరన నవ్వుల కోసం
నా మౌనం దాచిన మాటలు ఎన్నో......
నువు తెలియక చేసిన చేస్టల కోసం
నా సమయం చేసిన సవరనలెన్నో......
నువ్వుంటే నా కలల ప్రయాణం ,,
తప్పక చేరును నిజాల తీరం......
నీ నవ్వుంటే నా జీవితకాలం,,
బాదలు లేని విజయం ఖాయం......

Labels:

పిచ్చి కవిత

మనిషి మనిషిలో మానవతత్వం...
మనసు మనసు లో కరుణా భావం...
నిజాయితీనే నమ్మిన లోకం...
లంచం అడగని ప్రభుత్వ రంగం...
పదవులు కోరని పెద్ద మనుషులు...
మమతను వీడని మంచి మనసులు...
పది నిమిషాల్లో నే రాసిన వైనం,,,
పది యుగాలకైనా కనిపిస్తుందా...
రాని మార్పును రాసిన నేను ,,,
రాదని తెలిసే రచియించాను....
ఈ తోచని మనసు తోచినట్టుగా,,,
రాసిన రాతలు "పిచ్చి కవితలే"....

Labels: