Sunday, December 1, 2019

ఆత్మబలం


ప్రతి పిల్లవాడు బాల్యంలో, నీతి కథలు వింటాడు..
కొన్ని కథల్లోని నీతికి, తను ప్రభావితుడు అవుతాడు..
కథల్లోని పాత్రలే, తనకి ఆదర్శం అవుతాయి..
వాడి భవిష్యత్తు సాధనలో, ముందుకు నడిపిస్తాయి...

నావరకైతే, కథలెన్నో మా అమ్మ నోట విన్నాను..
కథలెన్నో ఉంటున్నా, అందులోని పాత్రలెపుడు మారలేదు..
చిన్నన్న, పెద్దన్న, ప్రతి కథకి ప్రధమ పాత్రలు..
చిన్నొదిన, పెద్దొదిన, కథల అదనపు బలాలు...

ఆ మహా కథన, కథాంశాలు చాలానే ఉండేవి...
నా ప్రతి పరిస్థితికి సరిపోయే ఉదాహరణ దొరికేది..
కథకి శీర్షికలే లేకున్నా, గొప్ప సందేషం ఉండేది..
కథల నేపద్యం ఏదైనా, నను ముందుకు నడిపించేవి...

మాకు డబ్బులేని రోజుల్లో, మీ ఆర్థిక ఇబ్బంది కథ...
నా మనసు భారమైన రోజున, మీ జీవిత పోరాట కథ...
నా పైచదువుల రోజుల్లో, పద్దది గల మీ క్రమశిక్షణ కథ...
నా మొడటి ఉద్యోగం రోజున, మీ తొలి జీతము కష్టాల కథ...
నాకు పెళ్ళి వయసు వచ్చాక, మీ పెళ్ళి జరిగిన తీరు కథ...
సందర్భం వచ్చినపుడు, మీ అన్యోన్యమైన దంపతుల కథ..

మా అమ్మ నోట విన్న కథలు, కొన్ని కళ్ళార కూడ చూశాను..
నే గతము కానలేకున్నా, మీ కష్టం ఊహించగలను..
ప్రతి ముఖ్యమైన సమయమందు, మాకు మీ సాయం ఉన్నింది..
అమ్మ ప్రతి అడుగుకు, ఆత్మబలం మీరేగా పెంచింది...

కష్టం నేర్పిన పాఠం, ఎప్పటికీ గొప్పదే...
విలువలుగల మీ విజయాలకి, మీ గతాలే తొలి పునాదులు...
చిన్నమామ లోన ఉన్న, పద్దతిగల దూకుడు..
పెద్దమామ లోన ఉన్న, పరిణతిగల అనకువ..
నా అలోచన తీరులో, ఎప్పటికీ ఉంటాయి..
నా ప్రతి విజయానికి, వెన్నులా నాతోనే నిలుస్తాయి...

పాతికేళ్ళు గడిచినా, మీ దాంపత్యంలోని అన్యోన్యము..
మా తొలి అడుగుల పయనానికి, ఎప్పటికీ ఆదర్శము..
ఏ ఒడిదుడుకులు వచ్చినా, చదరని మీ బాంధవ్యము..
మీ పిల్లల పెంపకాన కనిపించే, ఆప్యాతలకే అద్దము..

మీ అందమైన ఈ బంధము, వంద ఏళ్ళు విరజిల్లాలి..
మీ ఆదర్శమైన గుణాలతో, మరో పదిమందిని నడిపించాలి..