ప్రేమ దాసి...
ఈ ఋతువుల ఆగమనం ఏ తీరున
ఉన్నా,
నీ ప్రేమవైపు నా గమనం సాగిస్తూ
ఉన్నా...
ఆ ఋతువులెన్ని మారినా,ఈ అవని అంతరించినా,
ఇది ఋతము నేను నీ
వాన్ని, నీ చెలిమి కోరు
ప్రేమికుని...
నన్ను
కూడ మరచి నేను నీవెంటే
వస్తున్నా,
నగమంతటి
ఆశతోన నీవైపే చూస్తున్నా...
ప్రేమ
మాట పక్కనుంచి జాలి కూడ లేదా,
పలకరింపుమాట
పక్కనుంచి ఓసారి చూడరాదా...
ఎండైనా
వానైనా నీ ఇంటిబయట నిలుచున్నా,
గడివేసిన
తలుపుతీసి గడపదాటి రావే,
ఆలపించు
నా మదిబాదను ఆలకించి పోవే...
నీ ప్రేమకై వేచి వేచి అలసి
సొలసి ఉన్నా,
నీ తలపులతో విలపించే నన్నుకాన రావే,
నా మదితలుపులు తీసున్నా, ఓసారి వచ్చిపోవే...
నీ చెలిమిగూడు చేరలేక చింతిస్తూ ఉన్నా,
నీ నవ్వులకై గాలించే నాకు కానరావే,
నా నవ్వు కూడ మరచిన
నను ఊరడించి పోవే...
నీ
ప్రేమ నోము నోచుకోక రోదిస్తూ
ఉన్నా,
నా చెంతన నువు ఉన్నట్లు
కలనైనా రావే,
నా కన్నీటిని కాస్త తుడిచి కలతతీర్చి
పోవే...
నీ ప్రేమకై వేచిఉన్న నా ప్రేమ వయసు
పెరిగినా,
నా మనసుపైన నీకు ఉన్న గౌరవమే
తరిగినా...
నీ మాట చాలు మోక్షమే
అని నే ఎదురుచూచుచున్నాను,
నీ మనసు కరగలేదా, చిరు
ప్రేమ కలగలేదా...
నిను
చూచు జన్మ దన్యమే అని
నీ ఎదురు నడుచుచున్నాను,
నా గాలి తాకలేదా, నను చూడ మనసు రాదా, నన్నెన్ని సిరులు చేరినా, నే నిను వదిలి
ఉండలేను...
నే చావు చెంత వాలినా, నీ చింత మానబోను,,,,,
