ఈ తరం మగువ తీరు
పేరుకు నే మగువనని, బయటిపనికి తగను అని,
ఇంటి పట్టు ఉండమనే చిన్నచూపు దేనికో....
చూపుకు నే వనితనని, పెద్దపనులు వద్దు అని,
దూరంగా వెల్లమనే అల్పదృష్టి దేనికో...
శతాబ్దాల కాలంగా ఏ అతివ అడగలేదనో,
దశాబ్దాల కాలంగా ఏ పడతి ప్రశ్న లేదనో...
నిన్నవరకు జరిగింది, నేటి మొదలు జరగదిది..
గతంలోన సాగింది, ఈరోజు మొదలు సాగదిది....
సాధనతో వచ్చేదే విజయమని వాధిస్తే,
మగ అయిన, మగువైనా ఆ సాధనేమొ ఒకటేగా...
ప్రయత్నానికోచ్చేదే ఫలితమని అంటే,
పురుషుడైన పడతైనా ఆ ప్రయత్నమేమొ ఒకటేగా...
పల్లము ఓ వైపుంటే ప్రవాహానికి తనకేంటి,
తూర్పైనా పడమరైన, ఏదిక్కుకైన దా సోహమే...
ప్రయత్నాన కసి ఉంటే విజయానికి తనకేంటి,
ఆడైనా మగ అయినా ఎవరికైన బానిసే....
గతంలోని మగువకున్న అనుకువంత మసిచేసి,
ఈ తరంలోని మగువలకది శక్తిగానె మలిచేసి...
వస్తున్నా కాలమా విజయమనే వేటకి...
ఈ మగువకున్న తెగువ చూసి నీ చేతనైతె ఆపుకో....
అడుగేస్తున్న సమయమా నీ యుద్దమున్న చోటుకి..
కొండంతటి శక్తితో నీకెదురొస్తున్నా కాచుకో....
