స్నేహమంటే ఇదేరా....(సూర్యచంద్రుల స్నేహం)
(దినకరుడు = రవి = సూర్యుడు) : (చంద్రుడు = జాబిల్లి = శశి)
రేయీపగలుకు తేడా తెలియక ప్రజ్వలించువాడు,
సూర్యుడనీ మన అందరికీ తెలిసిన జగానికే ఱేడు...
స్వయంప్రకాశం కాకపోయినా వెలుగునింపువాడు,
చంద్రుడనీ మన మదిలో మెలిసిన రేతిరికే ఱేడు...

ఇరు ఱేడుల నడుమన చిగురించిన చెలిమిని తిలకించినట్టి వైనం,
మన తెలుగుపదాలను తర్కించి గొప్పగా వివరించుటేగ భాగ్యం...

అనుక్షణమూ తన జ్వాలలతో మండుతున్న ఈ సూర్యుడన్నవాడు,
చూచుటకేమో అతి కఠినం అయినా చలువగుండెవాడు...
చీకటున్న ఆ చంద్రుడిపైకి తన కిరణాలు పంపుతాడు,
వెలుగులేని ఆ జాబిలిపైన తన కాంతి నింపుతాడు...

రవి కాంతినింపినా, తన కాంతిముందు శశి వెలుగు కానపడదు,
తను చేసిన సాయం వ్యర్థమాయనని రవి మనసు కుదుటపడదు...
గగనాన ఉన్న తన తోటి మిత్రుడికి విశ్వాన విలువలేదు,
అని రవి చింతచేసినా, ఏ చెంతవాలినా ఏ తీర్పు బోధపడదు...

తన మైత్రి మేలుకై రారాజు అయిన వెనకడుగు వేసినాడు,
సాయం చాలదు, త్యాగం తప్పదని నిర్ణయించినాడు...
ఆ దినము మొదలు దినకరుడి మదిన ఉదయాస్తమయాలు మొదలు,
ఆ క్షణము మొదలు జాబిల్లి యదన వెలుగులన్ని కదులు...

ఆ మరునాడు మొదలు ప్రతిరోజునింక రవి రెండు చేసినాడు,
నువ్వూ నేను ఒకటని చెప్పి, శశికి సగము పంచినాడు...
మిత్రుడి పేరుని మననం చేస్తూ రవి అస్తమించినాడు,
ఒక్కసారిగా విశ్వమంతలో చంద్రుడి విలువ పెంచినాడు...

జగానికే రారాజు తీరుగా రవి నిలవగలుగువాడు,
ప్రియనేస్తానికి విలువకోసమై త్యాగాన్ని చేసినాడు...
అందరిని అనచి, ఒక్కడిగ నిలిచి దివినేలగలుగువాడు,
రారాజు తగ్గి, నిశిలోని శశిని రేరాజల్లె మలచినాడు...

రవి పంచుతున్న ఆ వెలుగు పొందు ఈ చంద్రుడన్నవాడు,
ఆ వెలుగులోన తన చలువచేర్చి వెన్నెలగ మార్చినాడు...
రవి సెగలలోన అలసున్నవాల్లకే శశి సేద తీర్చినాడు,
జనవాలి వాణిలో రవిపైన నిందలను నివురు చేసినాడు...

ముందూ వెనుకా ఆలోచించక త్యాగాన్నే చేసిన చక్రవర్తి ఒకడు,
యుగాలు గడిచినా ఆ త్యాగం మరువని చత్రపతే ఒకడు...

రేయీ పగలను సగభాగాలని తెచ్చి, ఈ లోకాన్నంతా రంగులతొ నింపినారు,
ఈ గుణవంతుల స్నేహం ఓ ఘణచరిత్రగా విశ్వాన వెలిగిపోనీ,
చెమట, చలువను తీపీ చేదుని జగమంత నాటినారు,
ఈ రారాజుల వైనం, నేస్తం అనబడు పదమునకే నిర్వచనమల్లె అవనీ..