అర్చన,జ్యోతి వాల్లు అప్పుడప్పుడు చెప్తుండటం వల్ల పేరైతే తెలుసు గానీ, ప్రత్యేకంగా చూసింది గానీ, పని కట్టుకొని వెల్లి మాట్లాడింది గానీ ఎప్పుడూ లేదు..1st year అయిపోయింది, 2nd year అయిపొయింది, మేము మా juniors ki freshers party ఇస్తున్నాం.ఆ రోజు ఆ party కి తను రాకున్నా నేను రాకునా ఇప్పుడు నా life లో ఇంత ఆనందం, విడిపోయేటపుడు ఎలా తట్టుకోవాలో అనే బాద ,రెండూ ఉండేవి కావేమో.....
ఆ party లో దూరం నుంచి చూశా, అందరి మద్యలో నవ్వుతూ కనిపించింది..వెల్లి మాట్లాడాలంటే భయం,తప్పుగా అనుకుంటుందేమో అనే చిన్న సందేహం...కానీ దైర్యం చేసి chair ముందర వేసి కూర్చుని Hiii..... అని మొదటిసారి పలకరించా response ఎలా ఉంటుందో అని భయపడుతూ..... ఆ రోజు తను ఇచ్చిన Hi అనే ఆ reply నా mind కి అయితే చేరింది గానీ నా heart కి మాత్రం చేరలేదు....but ఎందుకో తెలీదు, మాట్లాడాలనే కోరిక మాత్రం చాలా ఉంది..ఏమైతే అది అయిందని కూర్చొని చాలా సేపు మట్లాడా..చాలా బగా మాట్లాడింది..ఆ రోజు నా జీవితంలో నాకు మొరొక ఆనంద జీవితాన్ని present చేసిన రోజు..
తర్వాత రాఖీ పండుగ రోజు అందరూ ఉన్నారని భయం కూడా లేకుండా నోట్లో sweet పెట్టి మరీ రాఖి కట్టింది. అప్పటికి కూడా తెలీదు shalini నాకు ఇంత close అవుతుందని. ఆ రోజు తను కట్టిన ఆ రాఖి మహత్యమో ఏమో తెలీదు గానీ ఇప్పుడు తనని చూడకుండా ఓ రోజు ఉండలేకున్నా, మాట్లాడకుండా ఓ పూట గడపలేకున్నా...
నేను, Ram అనుకుంటుంటాం.. sister అనే relation నిజంగా super రా అని... నాకున్న one sweeeet sister వల్ల ఆ relation లో ఉన్న తీయదనం నాకు బాగా తెలుసు...భయంతో "Hiii..." అని మొదలు పెట్టిన నా ప్రయాణం నన్ను చాలా దూరమే చేర్చింది...
ఓ రోజు college అయ్యాక room కి వచ్చి sms పంపా ..reply రాలేదు. చాలా సార్లు పంపా, చాలా సేపు wait చేశా ...no replyy..ఎందుకో చిన్న Tension.. ఆ tension భయంగా మారడానికికి ఎక్కువ time పట్టలేదు.ఈ రోజు college లో కూడా చూడలేదు, అందుకని అర్చన కి call చేశా., తెలీదు అనింది.ఇంక c.camp కు వెల్దాం అని అలగే చింపిరి చింపిరి బట్టలతో auto ఎక్కాను..
Journey మద్యలో "ha.. cheppu raa...gud eve.. yem doing" అనే చూశాక నా కల్లలోంచి జారిన ఆ కన్నీల్లు చూశాక తెలిసింది shalini అంటే నాకు ఎంత ఇష్టమో ...
ఏ బాదేసినా తనకే చెప్పాలనిపిస్తుంది, college ఏం జరిగినా తనకే చెప్పాలనిపిస్తుంది..ram, ఆశ అక్క, జ్యోతి అక్క వాల్లు పక్కన ఉన్నట్లే అనిపిస్తుంది తను నా పక్కన ఉంటే..
"నీతో చెప్పుకుంటే ఏ బాదైనా పోతదిరా" అని తను చెప్తుంటే నాకు కలిగే ఆనందం ఏంచేసినా రాదు,ఎంత సంపాదించినా రాదు. నిజంగా ఎంత నేను అనిపిస్తుంది.
· తను పలికే ప్రతి పదం ఆనందం,
· తను కదిలే ప్రతి కదలిక ఆనందం,
· సరదాకి నన్ను తిడుతుంటే ఆనందం,
· చిన్నపిల్ల లా అలుగుతుంటే ఆనందం,
· cell లో తన msg చూస్తే ఆనందం,
· college లో తన నవ్వు చూస్తే ఆనందం,
· తనతో నడిస్తే ఆనందం,
· తన పేరు వింటే ఆనందం,
· తన ఊసే ఓ ఆనందం...
ఇన్ని ఆంనందాలని dominate చేస్తూ "విడిపోవాల్సి వస్తుంది" అని గుర్తొస్తే తెలీకుండానే కన్నీల్లు వచ్చేస్తాయ్...
ఇస్టమైన వ్యక్తిని కలవడానికి వెల్తున్నప్పుడు, అమాంతంగ పెరిగే చిన్ని గుండె చప్పుల్లు, అదే వ్యక్తిని వదిలి వెల్తున్నప్పుడు మనకు తెలీకుండానే మన కల్లలోంచి జారే కన్నీల్లు నిజంగా చాలా valuable ...
ఇది చాలా కొద్ది మందికి, చాలా కొద్ది మంది వల్లనే జరుగుతుంది..అలా నాకెదురైన చాలా కొద్ది మందిలో shalini ఒకరు..
little angry, but a lots of love,
little argues, but a lots of care....
తనతో వేసే నాఅడుగులకు అలసట రాదు, తీరాలు కనపడవ్....
General గా B.Tech లో అమ్మాయి, అబ్బాయి 4 yearsmపాటు మాట్లాడి,గొడవ లేకుండా, arguments లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంటే చాలా కస్టం..అలాంటి వారు అసలు ఉండరేమో అనుకునే వాన్ని...
కానీ నాకు, shalini కి మద్య ఉన్న పరిచయంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా గొడవలు, miss understandings అనే పదాలే లేవు అంటే అతిశయోక్తి కాదు. "ఏంటి మనం అసలు గొడవనే పడము" అని comedy గా గొడవ పడుతుంటాం "kukka, pandi" అని తిట్టుకుంటూ...ha ha ha..
ఎంత happy గా ఉన్నా, ఎంత నవ్వుతున్నా "B.Tech అయిపోతుంది" అని గుర్తొస్తే క్షనాల్లో కన్నీల్లొచ్చేవి..పాపం చాలా చేసింది uncle కి పరిచయం చేయాలని..తను పరిచయం అయితే చేసిందిగానీ నేనే close అవలేకపోయా... మొట్టమొదటి సారి B.Tech ఇంకా 4 years ఉంటే బాగుండు అనిపిస్తుంది...
Life లో చాలా మంది పలకరిస్తుంటారు, చాలా మంది పరిచయం అవుతుంటారు...కానీ వారిలో చాలా కొద్ది మంది మాత్రమే heart కి దెగ్గరౌతారు...అలా దెగ్గరైన వాల్లకి ఆ heart పైన full command ఉంటుంది.. బాద పెట్టాలన్నా, బాద తీర్చాలన్న, సంతోషపెట్టలన్నా ,ఏం చేయాలన్నా...వాల్లు మాత్రమే చేయగలరు.
అలాంటివారు నాకు చాలానే ఉన్నారు...అందులో మాత్రం నేను చాలా అద్రుస్టవంతున్ని..but shalini రూపం లో నా life లో మరో sister enter అయింది.
నవ్వుల్లో నడుస్తున్న నన్ను ,మరింత నవ్వించడానికి,
ఏమూలో ఉన్న కాస్త బాదని కూడా దూరం చేయడానికి,
నా పక్కన లేకున్నా నాతో అన్నీ పంచుకోవడానికి...
heart కి ఇంత దెగ్గరయ్యాక వదిలి వెల్లటం ఎంత కస్టమో నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది..
· తనెప్పుడన్నా చెపాతి box తెచ్చినప్పుడు వద్దన్నా phone చేసి మరీ నాకు box ఇచ్చి నవ్వుకుంటూ, తనుమాత్రం ఏం తినకుండా, ఎవరన్నా అడిగితే "హా తిన్నానే, తిన్నాను" అని చెప్పుకుంటూ తిరిగేది....
· "నాకు చందమామ అంటే చాలా ఇస్టం రా...వీలైతే తెచ్చివ్వవా plzzz " అని చిన్న పిల్లలా అంటుంటే నవ్వు వచ్చేది... చందమామను తెచ్చి ఇవ్వలేనుగా... అందుకే చందమామ గురించి కవిత రాసి ఇచ్చా...
· ppt పని మీద ఏదో ఊరు వెల్లాల్సి వస్తే నేను రాలేదని phone చేసి " hu hu ను రారా.." అని ఏడ్చింది.... ఆ విషయం ఎప్పటికీ మర్చిపోలేను.
· అందరు tour కి వెల్తుంటే నేను రాలేదని తను కూడా money కట్టకుండా కూర్చుంది.తిట్టి పంపిస్తే వెల్లింది..bus బయలుదేరే ముందు నా చేయి పట్టుకుని బాదపడిన ఆ కల్లు, ఆ చేతి స్పర్శ ఇప్పటికీ గుర్తున్నాయి...
· exam లో నాకు marks తక్కువ వచ్చాయని next exam కి తనే కస్టపడి prepare చేసిన note book ఇచ్చింది.."నా అన్నయ్య ఎప్పుడూ top లో ఉండాలి, బాగా చదువురా plzzz " అంటుంటే ఎంత బాదేసిందో అసలు.........
B.Tech అయిపోతుంది అన్న బాద కొంచెమే అయినా, ఇంక ఎప్పుడూ కలవలేమేమో అని అనుకోవడానికే భయంగా ఉంది....
· గుర్తొస్తుంది...ఏం చేసినా గుర్తొస్తుంది...
· చెపాతి తింటుంటే గుర్తొస్తుంది...
· చందమామని చూస్తే గుర్తొస్తుంది...
· side bag వేసుకొని నడిచే ఏ అమ్మాయిని చూసినా గుర్తొస్తుంది...
· అన్నయ్యా అని ఎవరు ఎవర్ని పిలిచినా గుర్తొస్తుంది...
· కర్నూలు కి వస్తే గుర్తొస్తుంది...
· నా dairy చూస్తే గుర్తొస్తుంది...
· ఏ engg clg ని చుసినా, student ని చూసినా గుర్తొస్తుంది...
· అసలు నా పేరు కింద "B.Tech" అనే degree చూస్తూనే గుర్తొస్తుంది......కానీ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొస్తుంది.
ఇప్పుడు కూడా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది..
friends అప్పుడప్పుడు అంటుంటారు... "అలివేలు నీకు దేవుడిచ్చిన చెల్లెమ్మ రా" అని...హా హా నిజమేనేమో..thank u soo much godd. but life long నిజంగా నా చెల్లి అయి ఉంటే ఇంకా బాగుండు..
వీలైతే తనకు ఏం ఇవ్వడానికైనా నేను ready కానీ తన నుంచి ఏమీ కోరుకోవడం లేదు...
ఎప్పుడో B.Tech అయ్యాక 2013 లోనో 2033 లోనో నేను గుర్తొస్తే అప్పుడు happy గా ఉన్నాం కదా అని చిన్ని చిరు నవ్వు, ఇప్పుడు కలిసి లేము కదా అని చిన్న బాద..తనకు అనిపిస్తే అదే నాకు చాలు....
ఒక మంచి Relation ని సంపాదించుకోవడం అంటే ఎన్నో లక్షల కోట్లు సంపాదించినట్లే... ఆ విశయంలో మాత్రం నేను ఎప్పటికీ కోఠీస్వరున్నే.....
Thank you my dear Ammuluuu...
నువ్వు ఎక్కడ ఉన్నా happy గా ఉండాలి...ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ,నవ్విస్తూ ఉండాలి...
ఇట్లు .........
మాటకి దూరంగా ఉన్నా, మనసుకు ఎప్పటికీ దెగ్గరగానే ఉండి, ఎప్పుడూ నీ మంచి కోరే నీ అన్నయ్య...
CHINNA