16th April 2012… It’s a black day
16th April 2012… It’s a black day
నన్ను కన్న వాల్లూ కాదు, నేను కట్టుకున్నవాల్లూ కాదు, నా కల్లముందు తిరిగేవాల్లూ కాదు, నా కలల్లో కన్పించేవాల్లూ కాదు, అన్నా కాదు, చెల్లీ కాదు, అక్కా
కాదు, తమ్ముడూ కాదు, నా బందువులూ కాదు, నాకేదో చేయాల్సినవాల్లూ కాదు, నాతో నడిచేవాల్లూ కాదు, నన్ను నడిపించే వాల్లూ కాదు, నా సొంతవాల్లూ కాదు, సొంతం అనుకునే నా స్నేహితులు కూడా కాదు....
ఒక Friend అన్నయ్య, ఓ మంచి కల్మశం లేని Friend అన్నయ్య చనిపోతే నాకేస్తున్న బాధ ఎంతో చెప్పలేకున్నా...
రోజా... ఓ మంచి Friend….
B.Tech
లో పరిచయం అయింది....
ఇంట్లో ఎవరున్నా, ఎందరున్నా అన్ననే తన ప్రపంచం, నచ్చిన వస్తువు కొనాలన్నా అన్న, కలసి సినిమాకి వెల్లలన్నా అన్న, అడగకముందే అన్నీ ఇచ్చే అన్న.... అటువంటి అన్న తనకు దూరం అయ్యాడని తెలిసిన క్షణాన తనేమవుతుందో అని చాలా భయమేసింది... నంద్యాల్ Hospital లో ఉన్న నేను రోజా ఎలా ఉందో చూడాలని, వీలైతే ఓదార్చాలని అప్పటికప్పుడు కర్నూల్ కి బయలుదేరా... రోజాని ఎటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందో అన్న భయంతో అక్కడికెల్లా...
అన్న పక్కనే కుర్చీలో కూర్చుని, ఏడ్చి ఏడ్చి ఇంక ఇంకిపోయిన కన్నీల్లతో, పైకిలేస్తే పడిపోయేంత నీరసంతో, రెప్ప వాలిస్తే ఆ క్షణం అన్నని చూడలేనేమో అని అలాగే చూస్తూ కనిపించింది... పక్కన లక్ష్మి చెప్తే నావైపు చూసింది....
ఏడ్చి ఏడ్చి అలసిపోయిన రోజా నన్ను చూడంగానే మల్లీ ఏడ్చడం మొదలుపెట్టింది.... వెల్లి పలకరించి పక్కనుండి ఓదార్చాలని ఉన్నా ధైర్యం చేయలేకపోయా.... ధైర్యం చేయలేక దూరంగా Dull గా కూర్చున్నా....
ఏడ్చడానికి కూడా ఓపిక లేని రోజా…. అసలు స్ప్రుహలోనే లేని రోజా అమ్మ…. మాట్లాడటానికి మాటలే రాని రోజా నాన్న…. ఎలా బాదపడాలో కూడా తెలీని రోజా తమ్ముడు..... ఇలా అందర్ని చూస్కుంటూ అలాగే దూరంగా కూర్చున్నా....
ఇంక అన్నని సంస్కారాలకి తీసుకెల్తున్నపుడు రోజా ఏడ్చిన తీరు, పొలిమేరలో అన్న చెవిలో రాజా, రాజా…… అని ఆకాశానికి వినిపించేలా రోజా పిలిచిన పేరు... ఎప్పటికీ మర్చిపోలేను...
కల్లముందు చనిపోతే గుండెలో మండుతుంది, కన్నకొడుకు చనిపోతే కడుపులో మండుతుంది..... అని చాలాసార్లు విన్నా...కానీ ఇప్పుడే చూశా...
·
అంది చేతికొచ్చిన కొడుకు, చనిపోయి కల్లముందు ఉంటే ఆ కన్నతల్లి బాధ ఎలా ఉంటుందో చూశా...
·
ఇప్పటిదాకా మోసిన బరువుబాద్యతలన్నీ తన భుజాలమీద వేస్కుంటాడని ఆశ, ఆనందాలతో ఎదురుచూసే ఒక తండ్రి ఆవేదన చూశా...
·
ఇప్పటిదాకా అన్నిట్లో తోడుండి నమ్మలేనివిదంగా అప్పుడే వదిలివెల్తుంటే ఒంటరినైపోయానే అని ఏడ్చే ఓ చెల్లి బాధని చూశా....
ఇవన్నీ చూస్తుంటే..... నా కంటిరెప్ప వాలిన ప్రతి సారి ఓ కన్నీటిచుక్క నా చెంప పైన పడుతుంటే.... ఏడుస్తున్నానో, ఏమౌతున్నానో తెలీక నేనున్నా.....
అందరూ ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయి కూర్చుని ఉంటే, కొత్తవాల్లు వచ్చి పాత
విషయాలను గుర్తు చేస్తుంటే, అలసిపోయి ఆగిపోయిన కన్నీరు మల్లీ మల్లీ వస్తుంటే... అవన్నీ చూసి తట్టుకోవడం చాలా కష్టం..... కానీ ఇప్పుడు నా కల్లముందు ఉన్నవాల్లకు వచ్చిన కష్టం కంటే నా కష్టం అంత పెద్దది కాదని తెలుసు....
తల్లి చనిపోయిన మూడు సంవత్సరాలకే భర్త, భర్త చనిపోయిన మూడు నెలలకే తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మా అమ్మకు తెలుసు....
నాకల్లముందు చనిపోయిన నావాల్లు అంటే మా నాన్న... అప్పటికి నాకు ఊహ లేదు, ఇప్పటికి నాకు గుర్తు లేదు... అందుకే పెద్దగా బాధ కూడా లేదు....
కల్లముందు ఒక మనిషి చనిపోతేనే కాసేపు మనసంతా ఏదోలా ఉంటుంది... అలాంటిది మన ఆత్మీయులు, మనవాల్లు చనిపోతే ఎలాఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది... పాపం రోజా... ఎన్నో ఆశలతో ఉన్నింది.. B.tech
అయిపోయింది... Banglore కెల్లి అన్నతో ఉండి Job Search చేస్తా అని ఏవేవో అనేది.. అవన్నీ తలుచుకుంటే చాలా భాధగా ఉంది...
·
ఎక్కడన్నా బయట ఎవరైనా ఒక అబ్బాయ్ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే...''అరె రాజేష్ అన్న కూడా ఇలా ఉండాల్సింది కదా'' అనిపిస్తుంది...
·
ఎక్కడన్నా ఎవరన్నా ఒక అమ్మాయి బాధగా కనిపిస్తే..."అరె రోజా కూడా ఇప్పుడు ఇలాగే ఉంటుంది కదా'' అనిపిస్తుంది.
అది జరిగి నెల దాటింది... నాకే బాధ తగ్గట్లేదు... ఇంక రోజా పరిస్తితేంటో……..అమ్మ పరిస్తితేంటో... ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత నవ్వుతున్నా ఒక్కసారి ఈ విషయం గుర్తొస్తే Dull అయిపోతున్నా... ఏం చేయాలో అర్థం కావట్లేదు...
ఆనందం రాస్తే పెరుగుతుంది, బాధ రాస్తే తగ్గుతుంది అంటారు... అందుకే కేవలం నా బాధని తగ్గించుకోవడానికి రాసుకుంటున్నా...
ఎవర్నీ బాధపెట్టాలని కాదు, ఎవరికో ఏమో చెప్పాలనీ కాదు....
ఏదేమైనా......
Roja is missing her
brother a lot…. No one can replace his place in her heart…. Defiantly it’s a very
very big loss to roja and her family…..
Hope she will become alright soon…. Only time has answers to every
question….but we have to wait…..
CHINNA
