జీవన సూత్రాలు
క్షనానికో మలుపును చూపే విచిత్రమార్గం మన ఈ లోకం..
ఆ మార్గంలో ఓ రథమును నిలిపి సాగేదే నీ జీవన పయనం...
నీ దారిలోన ఎగుడుదిగుడులు,
ఎప్పటికి చదును కానివి, ఎన్నటికీ చెదిరిపోనివి...
పక్కవాడి జీవిత గమనం,
చదునుగానె కనిపిస్తుంది, సవ్యంగానే పయణిస్తుంది,
దూరమున్న కొండలు నునుపు,
అని మోసపోయి మన కన్నులు తెలుపు...
ఏ మలుపుందో, ఏమౌతుందో తెలియని నీ ఈ పయణంలోన,
ఏ మలుపున అది ఎటు వెలుతుందో ఎరుగని నీ ఈ ప్రస్థానం లోన....
దురాశ అనే దారిలొన నువు వెల్లబోకు ఓ వెర్రిమనవా,
నిరాశ నీకెదురౌతుందని తెలుసుకోర ఓ పిచ్చిమానవా...
కోపమనే కుంపటి చెంత వలబోకు ఓ వెర్రిమానవా,
ఆ కుంపటిలో కలిసిపోయి నువు కాలిపోకు ఓ పిచ్చిమానవా..
రాని దానికై పరుగు తీసి నువు అలసిపోకు ఓ వెర్రిమానవా,
ఎండమావిలో నీటిని వెతికి నువు మోసపోకు ఓ పిచ్చిమానవా...
ఈర్శాసూయల ఇంటిముందర నువు నడవబోకు ఓ వెర్రిమానవా,
ఆ గాలులు సోకి అప్పటి మొదలు నువు పతనమవకు ఓ పిచ్చిమానవా...
వెలితికుండలా ఒయలుపోయి నువు తొనకబోకు ఓ వెర్రిమానవా,
నిండుకుండ నీకెదురౌతుంది తిరిగిచూడు ఓ పిచ్చిమానవా...
నీతివిడిచి అవినూతితోన నువు ఉండబోఉ ఓ వెర్రిమానవా,
నీచమైన ఆ నూతిలోన పడి నువు నానిపోకు ఓ పిచ్చిమానవా...
నీ చుట్టూ ఎందరు ఉన్నా, చట్టాలే నీ చెంతన ఉన్నా,
బోగాలకు దరిగా ఉన్నా, నువు ఐశ్వర్యం ఒడిలో ఉన్నా...
ఓకానొక సమయంలోన, విధి వెలివేసిన గడియలలోన...
వాడిపోవు పువ్వులాగ నువు రాలిపోక తప్పదు...
నిను మోసిన మట్టిలోనె నువు కలవక తప్పదు...
ఈ బతికి ఉన్న కొన్నాల్లైనా సవ్యంగా బతకరా,
లేనిపోని ఆశలతో ప్రతి క్షణమూ చావకురా..
నువు చావుచెంత వాలేదాకా, ఆరోజు నిన్ను చేరేదాకా,
ఏరోజు నువ్వు ఆగిపోకు, చెడుదారిన చేరబోకు...
ఆరోజు నిన్ను చేరినాక, నువు ఈలోకం దాటినరోజు,
నీ పేరు ఇలన నిలిచుంటుంది, నీ ప్రతిమ ముందు వెలుగుంటుంది...



