ఎన్నాల్లైనా నిన్నల్లోనే, నీ ఊహల్లోనే ఉన్నాను...
ఎన్నేల్లైనా నా కన్నుళ్ళోన, నీజతగానే ఉన్నాను...
కాలమనే ఈ మాయాజాలం, నా నవ్వులనే నట్టేట ముంచినా,
కావ్యమనే ఈ పదసంచారం, మన జ్ఞాపకాలలో విహరించనివ్వనీ...
నా మౌనంలోనూ నీ ధ్యానం, ప్రతి గానంలోనూ నీ స్మరణం..
నా ప్రతి వేకువలోనూ నీ స్వప్నం, ఏవైపు చూసినా నీ రూపం..
గడిచిన గతమే నడిచొచ్చేలా, నా అణువణువూ నీ జ్ఞాపకమేలే..
మిగిలిన స్మృతులే ఓ పవనం లాగా, క్షణక్షణమూ నా మేను తాకెలే...
