ప్రకృతీ పాఠశాలే...
తప్పటడుగులేసి మరీ, నడక నేర్చుకున్న పిల్లలం,
పొరపాట్లు నేర్పు పాఠాలకు, ఎప్పటికీ పాఠకులం...
తప్పులనే చేసిమరీ, ఒప్పు తెలుసుకునే మనుషులం,
గతము అనే గురువుతోన, మమేకమైన శిష్యులం...
పద్దతిగా గమనిస్తే, ప్రకృతి ఓ పాఠశాల,
ప్రతిప్రశ్నకు బదులిచ్చే, చక్కని గ్రంథాలమాల...
సమయపాలన నీ సమస్యైతే, సూర్యుడు ఒక ఉదాహరణ,
వెలుగివ్వాలను లక్ష్యమే, ఆ గుణముకు ఒక ప్రేరణ...
సుఖధుఃఖాలే నీ ప్రశ్నలైతే, అడవుల్ని అడుగు వివరణ,
ఋతువులెన్ని మారినా, అవి నిట్టూర్చి నేలరాలునా??
ఓటమి నిను కలిచేస్తే, కెరటాలను గమనించు,
పడి లేస్తేనే తమ అందమని, కాస్తైనా గ్రహించు...
నీ రూపము నచ్చకుంటె, గాలి స్థితిని ఊహించు,
ఏ ఆకారం లేకున్నా, తన ప్రాముఖ్యతనే గుర్తించు...
తన వేర్లే పునాదిగా, పైకెదిగిన ప్రతి వృక్షము,
మన మదిలో ఉండాల్సిన, ఆత్మవిశ్వాసానికి సాక్షము...
ప్రతి తప్పును వీక్షిస్తూ, క్షమిస్తున్న అంతరిక్షము,
విశ్వానికి పెద్దగా, అది మన అందరి పక్షము...
నిశిలోని శశిని చింతించకంటు, రవి వెలుగు పంపినాడు,
గగనాన ఉన్న తన తోటి మిత్రుడికి, తోడు నిలిచినాడు,

బలవంతుల అసలుబలం, బలహీనులనూ గెలిపిస్తేనే,
ఒకసంఘంలో ఉన్నోల్లము, ఒకరికొకరుగ కలిసుంటేనే...
నేర్చుకునే మనసుంటే, మనిషి ఎన్నటికీ విధ్యార్థే,
మెరుగవ్వాలని అనుకుంటే, తనకు తానెపుడూ ప్రత్యర్థే...