Saturday, November 24, 2012

అన్న ప్రేమ



నిండు జాబిలి మోముని చూసి,
నా చిన్ని చెల్లిని తనలో తలచి,
నాలోని నలతని నవ్వుగ మలిచి,
ఆనందించే అన్నని నేను...

నా బుజ్జి చెల్లి నాచెంత లేదని,
రెట్టింపు ఆశతో నింగిని చూస్తే...

పున్నమి అయినా చంద్రుడు లేడు,
మేఘపు మేనిలొ కనుమరుగైనాడు...
పేరుకు మాత్రం రేయికి ఱేడు,
అంబుధి దాడికి తలవంచాడు....

అనుదినమూ తొలి వేకువజామున,
పక్షులు పలికే కిలకిలలోన,
నా చెల్లి పలుకులో తొలుకుతు ఉన్న,
తీపిని తలిచే అన్నని నేను...

నా చిన్ని చెల్లి నా చెంత లేదని,
రెట్టింపు ఆశతో నా చుట్టూ చూస్తే....

వేకువ అయినా కిలకిలలే లేవు,
పక్షి మోమున కలనే లేదు...
చలిలో పాపం చలనమె లేదు..
విహంగమైనా విహరించుటలేదు....

నా మేనును తాకే చిరుగాలులలోన,
అది నాపై వదిలే చల్లదనాన,
నా చెల్లి స్పర్శనే మనసారా తలచి,
చిరుగాలికి నే ఎదురుగ నిలిచి,
ఆనందించే అన్నని నేను....

నా బుజ్జి చెల్లి నా చెంత లేదని,
రెట్టింపు ఆశతో నే బయటకు వస్తే...

ఏవైపు చూసినా చిరుగాలే లేదు..
ఎంత వెతికినా తన జాడే లేదు...
గాలికి కూడా జాలే లేదు,
అన్న ప్రేమని ఆలకించదు...

నా చెల్లి స్మృతులు నను చేరనీయక,
నాలోని గతులు గతమంచు చేరక...
ప్రాణుల మొదలు, ప్రకృతి వరకు,
కక్షకట్టి నను బాధపెట్టినా..
కరుణ వీడి నను ఏడిపించినా...

నా హృదయం చేసే స్పందనలోన,
తన బుడి బుడి అడుగుల సవ్వడి వింటూ,
తను తడబడకుండా వెంటే ఉంటూ..
ఆనందించే అన్నని నేను...

స్పందనలన్నీ ఆగే వరకు,
నా జీవితగమనం సాగే వరకు...
నా చెల్లి తలపు నను వీడబోదులే...
నవ్వు మోము నను వదలబోదులే....

Tuesday, November 13, 2012

Miss you my dear sister.. given by god..


వెలుగు వెలుగులా లేదు నాకు నువు నా చెంత లేని ఈ నిమిషాన,
నా దిగులు తరిగి నను వీడబోదు నీ ఒంటరైన ఈ సమయాన,
నా మది నవ్వలేదు ఓ రోజు కూడ నీ ఊసులేని ఈ లోకాన,
నిను చేరలేక, ఏ నవ్వురాక నే మిగిలి ఉన్న ఈ శోకాన...

నిను చూడక మానవు నా కలలు,
కనుజారక మానవు నా కన్నీల్లు....
నిను చేరక మానదు నా మనసు,
తన లోగిలి నువ్వే అది తెలుసు...

చూపుకు నా చెంతలేక, మరు తీరమందు నీవున్నా,
ఎప్పటికీ నను వీడదు కమ్మనైన నీ తలపు,
నా యదచప్పుడు తానేనని మౌనంగా అది తెలుపు...

కలలలోన నిన్ను చూసి కల్లు తెరిచి లేస్తున్నా,
నువులేవని తెలిసే నా మదిలో ఈ నిట్టూర్పు,
అది తీర్చగ నిను కోరెను ఓ కమ్మనైన ఓదార్పు...

నవ్వుతున్న నగుమోముతోటి నను ఓదార్చిపోగ రావే,
ఆ మోముచూసి, నే నన్ను మరచి నా ఆనందమంత జమ చేసేను...
కలలు దాటి కనులముందు కనిపించులాగ నను చేరే...
నీ ఉత్సంగమందు నే ఊరడిల్లి నా శోకమంత వదిలేసేను...

మదిన ఉన్న నా బాధనంత నే కవితలుగా రాశాను,
నా బాధకున్న ఆ భావమంత ఓ చిన్ని పాటగా పాడాను,
ఈ కవనమైన, నా గానమైన ఆ ప్రాణమొచ్చి నిను చేరేనా...
నీ చిన్ని “ అన్న” లో ఉన్న ఆర్తిని, నీ కల్లనీల్లుగా అవి మార్చేనా....

ప్రతిదానికి అవది ఉంది



జననమనే వెలుగున మొదలై,
మరణమనే నిశిలో కలిసే...
నీ జీవితమే పథము సోదరా,
పయణించే రథము సోదరా...

సారథివై నువు దారి చూపినా,
తన అవదిని దాటి వెల్లబోదురా...
నీకనువుగ మార్పు కోరినా,
ఏతీరుగైన అది మారబోదురా...

నువు జనియించిన మొదటి రోజునే,
నీ చివరి రోజు రాసుంటుంది...
నడక నేర్చి నువు నడిచిన క్షణము,
నీ చరణాలకు అది దరి అవుతుంది...

మార్చాలని ప్రయత్నించినా మారనిదే మన మరణమన్నది,
చెరపాలని ప్రతిణ పూనినా, చరగనిదే తలరాత అన్నది...

ఆనందంగా నింగిన ఎగిరే,
అందమైన పథంగమైనా..
ఆధారం దాటి వెల్లలేదులే,
దారం తెగితే ఎగరలేదులే...

అటు ఇటు ఊగే ఊయలలోన,
తన అణువణువూ స్వేచ్చే ఉన్నా..
తన అవదిని దాటి ఊగలేదులే,
తన స్కంబమునొదలి వెల్లబోదులే....

చిన్న చిన్న సరదా కోసం,
నీలోన ఉన్న సత్తా కోసం,
శక్తికి మించిన సాహసాలను,
ఫలితం లేని ప్రయత్నాలను,
చెయ్యబోకురా వెర్రి మానవా...
పతనమవకు రా పిచ్చి మానవా...

ఆది ఉన్న ప్రతిఒక పనికి,
అవది కూడ ఉండుంటుంది..
అవది దాటి నడిచిన క్షణము,
అంతమొచ్చి మన చెంతుంటుంది...