అందరూ కవులే
ప్రకృతితో పోల్చి చూడు, నిను కదిపే ప్రతి విషయాన్నీ…
ప్రాసలతో పేర్చి చదువు, ఆ అందమైన పోలికని..
అదే కదా జనం మెచ్చు అసలుసిసలు కవిత్వము...
ఆ కళే కదా కవనమనే కాంతిలోని రహస్యము .
పదాల కరువు అసలు లేదు, మన తెలుగు అనే సాగరాన,
ప్రయాసపడే పనే రాదు, ఆ పదాలు కూర్చు సమయాన…
మనసు పెట్టి కదిలి చూడు, పదాల వెతుకులాట బాటలో…
నీకు కూడ చోటుంటుంది, తెలుగు సాహిత్యమనే కోటలో...

