Tuesday, January 31, 2012

నాది కాని ఈ నిమిషం నన్నడిగే ప్రశ్నలు,
నిన్ను చేరి నీతోటి విన్నవించు బాధలు...
నవ్వు లేని ఓ మతం,
నువ్వు లేని నా గతం...
మధురమైన
 జీవితం,
నీ రాకతో స్వాగతం...
నా ప్రతి రోజుకు ప్రాణమిచ్చి,
ప్రతిచోటా తోడు నిలచి,                                        aamani= vasantam= vasanta ruthuvu
నా అడుగుకు తోడు నడచి,
ఇప్పుడిలా నన్ను విడిచి,
దూరంగా వెల్తుంటే...
నోట మాట కరువైంది,
కనులనీరు వరమైంది,
అడుగు కదలనంటుంది,
హ్రుదయమాగుతానంది...
ఆకు లేని కొమ్మకే ఆమనొచ్చి వెల్లినట్లు,
నీలిగగన మద్యమాన మెరుపులొచ్చి పోయినట్లు,
నా జీవితాన నీ బందం,
పలకరించి పోయింది...
మన ఇద్దరి అనుబందం,
చివరి దశకు చేరింది...
తిరిగిరాని వాసంతం,
నేటి మొదలు నా సొంతం....
అందమైన ఈ పర్వం,
అంత్య దశన దుఃఖాంతం...
నను వీడని జ్నాపకం,
నీదైనది జీవితం..
నా మదిలో నీ స్థానం,
ఎన్నటికీ శాశ్వతం...
నా అడుగుల ఈ గమనం,
చేరు వరకు ఆ గగనం..

Labels:

Friday, January 27, 2012

Me & My Mind set

భరత్...   ఇది నా అసలు పేరు.
చిన్న...   ఇది అమ్మ పిలిచే పేరు... అమ్మతోపాటు ఇంకొందరు కూడా ...
నాలో కొన్ని +ve points ఉన్నాయ్,
కొన్ని -ve points కూడా ఉన్నాయ్. .
నేనంటే చాలా మందికి ఇష్టం,
కొంతమందికి ద్వేషం కూడా ఉండచ్చు. .
నా Life లో చాలా మంది నాకు ఆనందాన్నిచ్చారు,
కొంతమంది బాధనూ ఇచ్చారు,
ఇంకొంతమంది రెండిటినీ కలిపి ఇచ్చారు. .
ఇచ్చారు, ఇచ్చారు అనేకంటే నేనే తీస్కున్నాను అంటే బాగుంటుందేమో. . .
ఎందుకంటే పైన రాసినవన్నీ ఒకే దానిపైన అయి ఉన్నాయ్. .
అదే" ME & MY MIND SET "
"నేను, నా ఆలోచనా విధానం"
. .
దీన్ని బట్టే నేను, నా feelings ,నా thoughts ......అన్నీ....
నేను ఇప్పుడు రాసే ఈ Article లో అన్నీ నిజాలే రాద్దాం అనుకుంటున్నా...రాస్తాననే నమ్ముతున్నా, రాస్తా కూడా..
ఒకర్ని మెప్పించడానికో, ఒప్పించడానికో, నొప్పించడానికో రాయట్లేదు..నా గురించి నేను చెప్పడానికి రాస్తున్నా. .
నా గురించి తెలుసుకొవాలనుకునేవాల్లు దీన్ని చదవండి,
నా మీద నమ్మకం ఉన్నవాల్లు దీన్ని నమ్మండి. .
నన్ను పేరుతో పిలిచేవాల్లు తక్కువ. .
ఎందుకంటే... నేను
కొందరికి తమ్మున్ని,
కొందరికి అన్నయ్యని,
కొందరికి అల్లుడిని,
కొందరికి మనవడిని,
కొందరికి స్నేహితుడిని,
అమ్మకి కొడుకుని. .
ఒక్కోరి పిలుపు ఒక్కోలా ఉంటుంది..
కాని అందరి పిలుపులో ఆప్యాయత common గా ఉంటుంది...
నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా?
ఇన్ని పిలుపులు నన్ను చేరాయి అంటే,ఇంతమంది ఆత్మీయులు నాకు ఉన్నారు అనే కదా. .అదే
నేను చెప్పాలనుకున్నది..
నాకు రక్తసంబందం ఒకరకమైన ఆనందాన్నిస్తే, స్నేహసంబందం ఇంకోరకమైన ఆనందాన్నిచ్చింది. .
వీటిలో కూడా అప్యాయత common . .
అందరిముందు నవ్వులాటకి నన్ను ఎగతాలిచేసినా, నేనంటే గౌరవం ఉండి,నన్ను ఇష్టపడేవారు చాలానే ఉన్నారు. .
నాకు రెండు కుటుంబాలు. .
తమ భాద్యతలు పూర్తిచేస్తూ, నా బాద్యతలు గుర్తుచేస్తూ అనుక్షణం ఆనందాన్నిచ్చే నా సొంత కుటుంబం. .
నా వాల్లు కాకపోయినా మనవాల్లుగా ఊహించుకొని కొత్త బందాలను,భాద్యతలను స్రుష్టించుకుని నావెంటే నడుస్తున్న నా సొంతం అనుకునే కుటుంబం. .
ఈ రెండో కుటుంబంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు. . కాని ఒక్కటే అప్యాయత. .
నాకు కవితలంటే పిచ్చి
. .అని చెప్పడానికి నేను చలా గర్వపడుతున్నాను. .
ఎందుకంటే నా ద్రుస్టిలో ప్రతిమనిషికి ఏదో ఒకదానిపైన పిచ్చి ఉండాలి. .అప్పుడే అనుకున్నది సాధించగలడు. .
ఎంత బాదగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత పని చేసి వచ్చినా....ప్రశాంతంగా కూర్చుని ఒక కవిత రాస్తే చాలు
. . ఏదో సాధించినంత ఆనందం, ఏమైనా సాధించగలననే నమ్మకం. .
నేను చదివింది నాకోసం, నా కుటుంబం కోసం. .
నా కవితలు నా satisfaction కోసం, నా identity కోసం. .
అందుకే మల్లీ చెప్తున్నా . .నాకు కవితలటే పిచ్చి. .
నాకు పెద్ద పెద్ద ఆశలు లేవు. .
నేనేదో కనిపెట్టి, చరిత్ర స్రుస్టించి, ఆ చరిత్రలో నా పేరుని సువర్ణాక్షరాలతో నింపాలని నననుకోవడం లేదు
. .
ఎందుకంటే. .
ఆ ఆశ ఉన్నవాల్లు దాన్ని అందుకునే ప్రయత్నంలో ఏం కోల్పోతారో,
ఎన్ని కోల్పోతారో, ఎందర్ని కోల్పోతారో నాకు తెలుసు.
నా రెండు కుటుంబాలకు దెగ్గరగా, వారి ఆనందాలను, బాదలను పంచుకుంటూ, అన్నిట్లో తోడు నడుస్తూ అందరికి దెగ్గర్లో ఉంటే చాలు
. .
But definite గా నాకున్న limits లో , నాకున్న knowledge తో తప్పకుండా ఒక మంచి position కి వెల్తా. .ఎందుకంటే
I believe in my self. .
                                                  ఎవరికో నేను నచ్చడం పక్కన పెడితే, కొన్ని విషయాల్లో నాకు నేనే నచ్చను
. .
ఎందుకంటే నాలో +ve points తో పాటు కొన్ని -ve points కూడా ఉన్నాయని ముందే చెప్పాగా. .  
అదేంటంటే నన్ను ఎవరేమన్నా,ఏమనుకున్నాok గానీ
. .నావాల్లు, నా అనుకున్నవాల్లు నన్ను ఏమైనా అంటే hurt అవుతా. .నాకు తెలుసు అది వారు మనసులో పెట్టుకోరని,and అది వాల్ల హక్కు అని. .
అలా hurt అవడం నా తప్పే అని కూడా తెలుసు. .
Try చేస్తున్నా. .మారటానికి ఎప్పటినుంచో Try చేస్తున్నా. .తొందర్లో మారుతాననే అనుకుంటున్నా. .
ఇంకా రోజూ డైరీ రాస్తా. . ఎందుకంటే. .
నా గురించి, నా రోజుల గురించి, రోజులు నాకు నేర్పిన పాఠాల గురించి, రోజు రోజు కి నాలో మార్పు గురించి,నావాల్ల గురించి, వాల్లు నాకిచ్చిన ఆనందం గురించి చదువుకుని. . నవ్వుకుంటూ ఏడ్చడానికి, ఏడ్చుకుంటూ నవ్వడానికి, ఒక రోజు experience  తో ఇంకో రోజుని  design  చేసుకోవడానికి రాస్తా
నాకప్పుడప్పుడు కోపమొస్తుంటుంది. .
ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నప్పుడు, నేను భయపడేలా నిద్రలేపితే చెప్పలేనంత కోపం వస్తుంది. .
నేను జోకేసినపుడు ఎవరూ నవ్వకున్నా నాకేమనిపించదుకానీ. .ఏదన్న centiment matter  నడుస్తున్నప్పుడు నవ్వితే మాత్రం బాగా కోపం వస్తుంది. .
నా వాల్లయితే కోపాన్ని చూపిస్తా. .అలా చేయద్దని చెప్తా
నావాల్లు కాకుంటే నవ్వేస్తా. . నవ్వి నా కోపాన్ని controle  చేస్కుంటా
ఇంక నా ఇష్టాల గురించి చెప్పాలంటే
చెపాతి అన్నా, తిరుపతి లడ్డూ అన్నా ఎంత ఇష్టమో చెప్పలేను, నాముందు పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది
ఇంకా ఇష్టమైన వాల్లతో కలసి వెన్నెలలో కాలీ రోడ్డు పైన నడవడం అంటే చాలా ఇష్టం. .
Early mornning ఒంటరిగా, ప్రశాంతంగా, మెల్లగా  cycle  తొక్కుకుంటూ వెల్లటం అంటే చెప్పలేనంత ఇష్టం. .
ఛిన్నపిల్లలు నవ్వుతుంటే చూడటం, వాల్లతో పాటి నవ్వటం ఇష్టం. .
Sister అనే relation  అంటే ఇష్టం. .ఆన్నయ్యా. . అని పిలిపించుకోవడం ఇష్టం
భాదగా ఉన్నపుడు ఆకాశంవైపు చూడటం ఇష్టం. .
ఇష్టమైన వాల్ల ఒల్లో పడుకోవడం ఇష్టం. .
ఇష్టమైన వాల్ల ఇష్టాలను ఇవ్వటం ఇష్టం. .
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. .     

“MONEY IS A GOOD SERVANT, BUT A BAD MASTER”
దీన్ని చాలా మందితో పాటు నేను కూడా నమ్ముతాను, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. .
డబ్బు ఎందుకు సంపాదించాలి ? అనే ప్రశ్న మన ముందుంటే ఒక్కోరిది ఒక్కో answer. .
qustion ఎవరన్నా నన్ను అడిగితే మాత్రం. .
నేను డబ్బు సంపాదిస్తా, కశ్చితంగా సంపాదిస్తా. .
దానివల్ల వచ్చే భోగ భాగ్యాలను అనుభవించడానికో, లేకపోతే దాని మూలంగా వచ్చే పేరు ప్రతిష్టలను ఆశ్వాదించడానికో కాదు
డబ్బున్నా simple గా ఉండచ్చు అని చూపించడానికి, ఉండాలి అని చెప్పడానికి
డబ్బు వచ్చినంత మాత్రాన అహంకారం రాదు అని చూపించడానికి, రాకూడదు అని చెప్పడానికి. . సంపాదిస్తా
ఆని  answer చెప్తా
Answer మత్రమే కాదు, ఇదే నా  ఉద్దేశం కూడా. .                                                                                        

ఇప్పుడు నా age 22, ఎటు నడుస్తుందో తెలీని ఈ  life లో నేనిప్పటికే చాలా చూశాను. . .
ముందు చూడబోయేదాంతో పోలిస్తే ఇప్పుడు చూసిందంతా కొంచెమే అనిపిస్తింది. అనిపించడమే కాదు..అదే నిజం కూడా. . .
కొందరు ఆనందాన్నిస్తే ,ఇంకొందరు భాదనిచ్చారు. . .
కొందరు జ్నాపకాలనిస్తే , ఇంకొందరు గాయాలను మిగిల్చారు. . .
మంచో,చడో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉన్నారు. .                                        
"జీవితం అంటే ఒక పాఠ్యపుస్తకం లాంటిది, రోజుకో పాఠం చదువుతూ పోతూ ఉండాలి" నాకిష్టమైన వేటూరిగారు ఒక పాటలో రాసిన పదాలివి. . .అది నిజంగా నిజమే. . .
నా ద్రుష్టిలో మనిషంటే సంసారానికి, సంపాదనకి మాత్రమే పనికొస్తే చాలదు. . . అంతో ఇంతో సమాజానికి కూడా పనికివస్తేనే మనిషి అయినట్లు. .
జంతువులకి మనుషులకి తేడా మానవత్వం ఒక్కటే, మనం దాన్ని మర్చిపోతే మనం మనుషులమెలా అవుతాం. . .
చివరగా నాదో చిన్న ఆశ . .
ఓ కల్పన లాగా సాగే ఈ జీవన ప్రయాణం లో నన్ను, నా వాల్లను satisfy చేసుకుంటూ, వీలైనంత నేర్చుకుంటూ, కుదిరినంత నేర్పిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ,చేతనైనంత సంపాదిస్తూ, తోచినంత సాయం చేస్తూ అలా
అలా గడిచిపోతే చాలు. . .
సెలవ్. . .
                   ఇట్లు
                                     మీ
                                               చిన్న

Labels:

Friday, January 13, 2012

అల్లరి అందాలు

Awesome ,Awesome...
మొలకకి మొగ్గలుంటె ఆసం,               ( AWESOME =  ఆసం = EXCELLENT= చాలా బాగుంటుంది)
మొగ్గలు పూవులైతె ఆసం... 
Awesome ,Awesome...
చిలకకి పిలకలుంటె ఆసం,
పిలకకి పూలు పెడితె ఆసం...
పుట్టిన పాపలు అమ్మా అంటు పిలుస్తుంటె ఆసం,
ఏమ్మా అంటూ దరిచేరగానె తను పరుగుతీస్తె ఆసం...
Awesome ,Awesome...
చంద్రుడు చెంతకొస్తే ఆసం,
చేతిలొ ఇమిడిపోతె ఆసం...
Awesome ,Awesome......
మనిషికి రెక్కలొస్తె ఆసం,
నింగిలొ ఎగురుతుంటె ఆసం..
ఎర్రగ మండే సూర్యుడికేమో చలేస్తుంటె ఆసం,
పాపం అనుకుని మనమటు వెల్లి రగ్గులిస్తె ఆసం...
Awesome ,Awesome......
చుక్కలు చినుకులైతే ఆసం,
చినుకుకు దాహమేస్తె ఆసం...
Awesome ,Awesome......
నదిపై నడుస్తుంటె ఆసం,
నడకలు పరుగులైతె ఆసం...
ఆకాశంపై తలకిందులుగా నడుస్తుంటె ఆసం,
భూమ్యాకర్షనకి అక్కడినుంచి జారిపడితె ఆసం...
Awesome ,Awesome...
అద్దం అందమిస్తే ఆసం,
అందం తరగకుంటె ఆసం...
Awesome ,Awesome...
నాన్నలు బడులకొస్తె ఆసం,
పిల్లలు పనులకెల్తె ఆసం...
దేవకన్యలే దరికిచేరి నను మనువాడమంటె ఆసం,
నాకు కుదరదని, నన్ను వదలమని నే కసురుకుంటె ఆసం....
Awesome ,Awesome...
పక్షులు పలకరిస్తె ఆసం,
పనిలో తోడు వస్తె ఆసం...
Awesome ,Awesome......
నింగికి నిచ్చెనేస్తె ఆసం,
నిచ్చెన విరిగిపోతె ఆసం...
చదువులతల్లి నడుచుకుంటు మా ఇంటికొస్తె ఆసం,
గణిత సూత్రములు నన్ను అడిగి తను తెలుసుకుంటె ఆసం....
Awesome ,Awesome...
నా ప్రతి ఊహా ఆసం,
నా ప్రతి రాత ఆసం...
Awesome ,Awesome......
నా ప్రతి నవ్వూ ఆసం,
నా ప్రతి అడుగు ఆసం...
కవిత చదివి నువు మాటవరుసకే నను మెచ్చుకుంటె ఆసం,
నీ మాటలన్ని కోతలేననీ నే తెలుసుకుంటె ఆసం...

Friday, January 6, 2012

ఆకాశ విహారయాత్ర





జాబిలి కమ్మని వెన్నెల వెలుగులో,
చల్లని చినుకులు నను తాకిన వేల...
చక్కని చుక్కల పందిరి నీడలో,
కమ్మని గాలులు నను మీటిన వేల...
మదిలో బాధలు మాసేలాగా,
అణువణువు తెగ మురిసేలాగా...
నా తలపులలో ఓ చల్లని ఊహ,మనసంతా మురిపించిన ఊహ...
కల్లముందరే కదలాడింది....ఓ కమ్మనైన నా ఈ ఊహ..
నువ్వేమో నా ముందున్నట్లు,
నేనేమో నిను చూస్తున్నట్లు....
నీ ఒడిలో నే పడుకున్నట్లు,
కథలెన్నో నువు చెబుతున్నట్లు...
అన్నయ్య అనుభందం తోటి,
మేఘం అనబడు రెక్కలతోటి,
చంద్రుని చెంతన మనమున్నట్లు,
ముచ్చట్లెన్నో చెబుతున్నట్లు,
సర్వం తెలిసిన చంద్రునితోటి,
ఎన్నో లక్షల చుక్కలు దాటి,
స్వర్గంలోనికి అడుగిడినట్లు,
ఆ చోటంతా మన వశమైనట్లు....
నారదుడను ఓ సారధి తోటి,
విలాసమయమగు స్వర్గము దాటి,
బ్రహ్మలోకమున మనమున్నట్లు,
చదువులతల్లిని చూస్తున్నట్లు....
దివ్యదంపతుల దీవెన తోటి
ప్రశాంతమయమగు ఆ లోకము దాటి
కైలాసమ్మున కాలిడినట్లు,
శివనాట్యమ్మును చూస్తున్నట్లు...
సారధి చేతిన వీనను మీటి,
సౌరమండలము సైతము దాటి,
క్షీరసంద్రమున వెల్తున్నట్లు,
ఆదిదంపతుల ముందున్నట్లు,   
ఆకాశం మన ఇల్లైనట్లు,
దేవతలే మన వాల్లైనట్లు,
చంద్రమండలము మన ఆటస్థలముగా,
బ్రహ్మలోకమే మన విడిది ఇల్లుగా....
అణువణువు అలోచనతోటి,
ఊహిస్తే మన ఊహలు కోటి.....





                                                    

Labels: