Saturday, September 22, 2012

My profile


ముందుమాట


అంకితం


Thursday, September 6, 2012

ప్రకృతిలో నీతులు

చెయ్యాలని మనసున్నా పనికిరాని కడలినని,
రైతన్నలు తన నీటిని సాగుకు వాడరని,
తన నీటికి ఆవిరనే కన్నీటిని జతకలిపి,
మేఘముకే అప్పగించి చినుకులుగా మలచదా...
మనసుంటే మార్గముందని చెప్పకనే చెప్పదా...

సంద్రానికి సహాయంగ మేమున్నామని జతకలిసి,
ఉపనదుల మొదలు, జీవనదులు తనలోనే కలవవా...
మంచిపనికి ఆదరణలు కరువు కాదని తేల్చవా....

తనను తాను కాల్చుకుని, కొవ్వొత్తిని వెలిగించి,
త్యాగానికి తార్కానము అగ్గిపుల్ల కాగా,
అమరమైన స్నేహితుని జ్ఞాపకాలతోన
నిలువెల్ల కరిగిపోయి, తను కూడా కాలిపోయి,
ప్రేమకు పరమార్థంగా కొవ్వొత్తి మిగలలేదా...

సువాసనలు వెదజల్లి, ప్రశాంతతగ ప్రభవించే
అందమైన కుసుమాలు మూన్నాళ్ళే బతికినా,
బతికిఉన్న కాసేపు ప్రతిమదినీ మురిపించదా....
తన సువాసనలు ఆగెనని, తను నిలువెల్లా వాడెనని,
తనకుతానె రాలిపోయి నేలపైన వాలదా...
ఇక సెలవని స్వతహాగా మట్టిలోనె కలవదా...
బతికిఉన్న క్షణమైనా మంచిగానె బతకమని,
చెడు దారిన చేరు నాడు బతికికూడ వ్యర్థమని,
మారని మన మనుషులకే మౌనంగా చెప్పదా...

ఉరుములు ఎదురై బెదిరిస్తున్నా,
మెరుపులు నిలువున చీల్చేస్తున్నా,
సూర్యుడి వేడికి అతిదెగ్గర ఉన్నా,
రోజు రోజుకూ తనతలబారం పెరుగుతు ఉన్నా...
తను విరిగిన క్షణమున మనిషీ బతకడని,
తనను నమ్ముకున్న వాల్లకై తను నరకం చూస్తుంది,
మానవాలి భవితనే ముఖ్యమని తలచింది....
నిను నమ్ముకున్న వాల్లను నువు నడిరోడ్డున వదలకని,
స్వార్థాలకు బానిసవై ద్రోహిగా నువు మిగలకని,
అందమైన ఆకాశం చెప్పకనే చెప్పదా...

పాలలోన నీల్లు కలసి అవి పాలవలె మారినా
కనుచూపుకు పాలలాగ అందరికి కనిపించినా
రాజహంస దరికి చేరి వేరు వేరు చేయదా
పాలనీటి మిశ్రమాన పాలనొకటె తాగదా...
మంచి చెడులు కలిసి ఉన్న సమాజాన బతుకుతున్న
ప్రతి మనిషీ మంచితోనె తన అడుగులు వేయాలని,
తన చుట్టూ చెడు ఉన్నా మంచిగానె బతకాలని
తన జీవితాన్ని ఉదాహరణగ చూపిస్తూ చెప్పదా...

కంటిచూపు లేకున్నా, నీతి అనే బాటలోన నిలకడగా పయనిస్తూ,
నోట మాట రాకున్న, నీతిలోనె బతకండని ఇవి వినయంగా చెప్తుంటే,
పాటించను బరువైనా కల్లు తెరిచి చూడరా...
మంచితనం కరువైనా మనసు పెట్టి కానరా...
మనసుంటే పాటంచి, మంచిదారి పట్టరా...
పదిమందిని నడిపించి, మనిషిగ నువు నడవరా....

ప్రేమ త్యాగం



నా మనసును అద్దంలా చూపించగలుగు నీవు,
నీ మమతను రెట్టింపు చేసి ఇవ్వగలుగు నేను….
నన్ను ఒదిలి ఒక్క క్షణం ఉండలేని నీవు,
నిన్ను మరిచి గడియ కూడ గడపలేని నేను
నా హ్రుదయాన్నే కోవెలగా భావించే నీవు,
కోవెలలో నిన్ను ఉంచి పూజించే నేను….
నా మదిన మెదులు కథలో ప్రతి పుటలోనూ నీవు,
నీ నగుమోముకు ఏకార్థం నీ మనసులోన నేను….
నా మదిలోనే నీవున్నా,
నీ మనసంతా నేనైనా….
మనము కలవలేము, ఇక కలసి నడవలేము
మన మనువు జరగబోదు, మన మనసు అతకలేదు….
మన అలోచనలొకటైనా, ఆశయాలు వేరే
మన మనసులు ఒకతైనా, బతుకు తీరు వేరే….
ఆశయాలు వీడినామన బతుకు తీరు మార్చినా
మన కన్నవాల్ల నిర్ణయాన్ని కాదనడం అసాద్యమే

అథిదిలాగ వచ్చిపోవు ఆదరణే తప్ప,
అందమైన హరివిల్లుకె గగనమందు చోటు లేదు
నీ చెంతనె నిశ్చింతగ ఉండెదనని హరివిల్లు అడుగుతున్నా,
జాలిగుణం మరిచిన గగనమొప్పుకోదు,
కాల్ల వేల్ల పడినా హరివిల్లు నుండనీదు

గగనమంటి మన ఇల్లు, హరివిల్లు లాంటి మన ప్రేమ,
అథిదిగ నువు వచ్చినపుడు నిన్ను చూసి నవ్వినా….
కలసి ఉన్న కాసేపు కబుర్లెన్నొ చెప్పినా
పెల్లి మాటకొస్తే మన ప్రేమ శత్రువేగా,
నువ్వెంత గ్గరున్న, అందనంత దూరమేగా….

కల్లముందు కనిపించిన కొలను మాయమైతే,
అది అందం గా కనిపించిన ఎండమావి అయితే,
దాహంతో దరిచేరిన గొంతు మూగబోదా,
ఆశతోన ఆశ్రయించు మనసు విరిగిపోదా….

మనము కన్న కలలన్నీ కల్లలుగా మిగిలితే,
మనువు అన్న మాట మనకు ఊహే అయిపోతే,
అనుక్షణము నిన్ను ద్యానించిన నా  హృదయమాగిపోదా
దంపతులుగ మారాలను మన ఆశ నేలవాలి పోదా….

పెల్లి అనే మన ఆశ అంధకారమైనా,
ప్రేమ అనే మన బంధం అందమైనదేగా
జీవితాన ఒకరికొకరు తోడు నడవలేకున్నా,
జ్ఞాపకాల పుస్తకంగ జీవితాన్ని మలచనీ….

మనసంతా నీ ప్రేమే జన్మంతా తోడుగా,
క్షణమూ నను వీడని నీ జ్ఞాపకాల నీడలో,
మన ప్రేమ మాట తప్ప, పెల్లి ఊసు లేకుండా,
నీ ద్యానం తప్ప పక్క ద్యాస లేకుండా,
జీవితాన మన ప్రేమ శాశ్వతంగ మిగలనీ
విడిపోయే ప్రేమికులకు శాశనంగ మారనీ